42 మంది గురువులకు షోకాజ్
చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లోని పాఠశాలల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న 42 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీఈఓ డాక్టర్ రమేష్ తెలిపారు.
42 మంది గురువులకు షోకాజ్
చింతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తనిఖీలు నిర్వహిస్తున్న డీఈఓ రమేష్
చింతపల్లి/గ్రామీణం, న్యూస్‌టుడే: చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లోని పాఠశాలల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న 42 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీఈఓ డాక్టర్ రమేష్ తెలిపారు. సోమవారం చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. చింతపల్లిలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రెండు మండలాల్లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలలు, సంక్షేమ ఆశ్రమాల్లో టీచô్్స డైరీ, లెసన్‌ప్లాన్ వంటి రికార్డులను పరిశీలించగా వాటిని సక్రమంగా అమలు చేయడం లేదని గుర్తించామన్నారు. విద్యార్థుల నోట్ పుస్తకాలు, వర్కుబుక్స్‌లో తప్పులు సరిచేయడంలో జాప్యం వహిస్తున్నారని చెప్పారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనన్నారు. వీటి అమల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. లోపాలు గుర్తించిన పాఠశాలలకు సంబంధించి ముగ్గురు ప్రధానోపాధ్యాయులతోపాటు 39 మంది ఉపాధ్యాయులకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎంఈఓ ప్రసాద్ పాల్గొన్నారు.
గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: పాఠశాలల్లో కనీసం చదువు చెప్పకపోతే ఎలా అని డీఈవో రమేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జీకేవీధి బాలికల ఆశ్రమోన్నత పాఠశాల, కస్తూర్బా విద్యాలయాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థినుల కోసం తయారుచేసిన ఆహారాన్ని పరిశీలించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. కొందరు విద్యార్థినులు తడబడటంతో పాఠాల బోధన ఇలాగేనా అంటూ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని, బోధన సరిగ్గా లేదని అసంతృప్తి చెందారు. కస్తూర్బా విద్యాలయంపై ఫిర్యాదులు అధికంగా ఉన్నాయన్నారు. ఉపాధ్యాయినులు విద్యార్థినులను బయటకు తీసుకువెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో బోధన, భోజనం సక్రమంగా లేకపోతే చర్యలు తీసుకుంటామని డీఈఓ రమేష్ హెచ్చరించారు. ఎంఈఓ చంద్రశేఖర్, సీఆర్పీ దేవేంద్ర పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment