SBI Loan: ఎస్బీఐ అదిరిపోయే స్కీమ్.. చౌక వడ్డీకే రూ.10 లక్షల రుణం, కొంత కాలమే ఈ ఆఫర్!
Loan | దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అదిరే స్కీమ్‌ను అందుబాటులో ఉంచింది.
దీని కింద సులభంగానే రుణం పొందొచ్చు. తనఖా లేకుండా తక్కువ వడ్డీకే లోన్ పొందొచ్చు. ఇది పరిమిత కాల స్కీమ్. కొంత కాలమే అందుబాటులో ఉంటుంది.
ఎస్బీఐ ఎస్‌హెచ్‌జీ సమూహ్ శక్తి స్కీమ్‌ను అందిస్తోంది. ఈ పథకం కింద ఎస్బీఐ స్వయం సహాయక సంఘాలకు రూ. 10 లక్షల వరకు లోన్ అందిస్తోంది. దీనికి ఎలాంటి పూచికతు అవసరం లేదు. తనఖా లేకుండా ఈ తరహా రుణాలు పొందొచ్చు.
ఈ ఎస్బీఐ స్కీమ్ 2022 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. 2023 మార్చి 31 వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. ఈ స్కీమ్‌లో భాగంగా స్వయం సహాయక బృందాలకు తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి. అన్ని జిల్లాలలోని స్వయం సహాయక బృందాలు రుణాలు పొందొచ్చు.
రూ. 3 లక్షల వరకు రుణాలపై అయితే వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. ఇతర లోన్స్‌తో పోలిస్తే.. ఇది తక్కువ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు. అదే రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు మొత్తంపై అయితే వడ్డీ రేటు ఏడాది ఎంసీఎల్ఆర్గా ఉటుంది. ఇంకా రూ. 5 లక్షలకు పైన లోన్ అమౌంట్ అయితే వడ్డీ రేటు 9 శాతంగా ఉంది.
స్వయం సహాయక బృందాలకు క్రెడిట్ ఫెసిలిటీస్‌పై అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తున్నామని ఎస్బీఐ ట్వీట్ చేసింది. స్కీమ్ వివరాలను వెల్లడించింది. రూ. 10 లక్షల వరకు మొత్తంపై ఎలాంటి తనఖా అవసరం లేదని తెలిపింది. ఇంకా రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు రుణాలకు సీజీఎఫ్ఎంయూ కవరేజ్ వర్తిస్తుందని తెలిపింది.
ఎస్బీఐ స్వయం సహాయక బృందాలకు టర్మ్ లోన్స్ అందిస్తోంది. అలాగే క్యాష్ క్రెడిట్ లిమిట్స్ ఆఫర్ చేస్తోంది. స్వయం సహాయక సంఘాలు వాటి సేవింగ్స్‌పై 4 రెట్లు వరకు ఎక్కువగా లోన్ పొందే వెసులుబాటు ఉంది. ఆర్బీఐ రూల్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
అయితే ఈ లోన్ మంజూరు లిమిట్ మాత్రం బ్యాంక్ ప్రాతిపదికన మారుతూ ఉండొచ్చు. కొన్ని బ్యాంకులు తక్కువ లోన్ మొత్తం కూడా అందించొచ్చు. అది బ్యాంకుల ఇష్టం. 1:1 నుంచి 1:4 రేషియోలో లోన్స్ జారీ చేయొచ్చని ఆర్బీఐ పేర్కంటోంది.
కాగా ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం చూస్తే.. బ్యాంక్ 2022 మార్చి 31 నాటికి స్వయం సహాయక బృందాలకు దాదాపు రూ. 24,023 కోట్ల రుణాలు జారీ చేసింది. 8.71 లక్షల స్వయం సహాయక బృందాలకు రుణాలు అందాయి. వీటిల్లో 91 శాతం మహిళలు ఉన్నారు.
0 Comments:
Post a Comment