🏮'ఆధార్'తోనే జీతాలు
♦️ఆర్బిఐకి రాష్ట్రం ప్రతిపాదనలు
🌻ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి
ఇప్పటివరకు నగదు బదిలీ పథకాలకే ఆధార్‌ను అనుసంధానం చేస్తున్న ప్రభుత్వం ఇకనుండి జీతాలు, ఫించన్లు వంటి ప్రభుత్వ చెల్లింపులకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆధార్ పేమెంట్ బ్రిడ్జి సిస్టమ్ (ఎపిబిఎస్) ను వినియోగించడానికి అనుమతి రూ రిజర్వుబ్యాంకుకు ప్రతిపాదనలు కూడా పంపినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న ఇ-కేబేర్ విధానాన్ని ఎపిబిఎస్ ను అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్‌లో చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇటీవల రిజర్వ్ బ్యాంకు, ఇతర కేంద్ర ఆర్థిక అధికారులతో జరిగిన ఒక భేటీలో కూడా ఇదే అంశంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీని వల్ల ఉద్యోగులకు సంబంధించిన అన్ని వివరాలు ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చేసే చెల్లింపులను ఆధార్ అనుసంధానిత వ్యవస్థ ద్వారానే చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశాలపై ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు పరిశీలన చేస్తున్నట్లుతెలిసింది
0 Comments:
Post a Comment