ఇండియాలో ఇండిపెండెన్స్ డే ఎంత ముఖ్యమో రిపబ్లిక్ డే కూడా అంతే ముఖ్యం. ప్రతీ ఏడాది జనవరి 26న ఈరోజును జరుపుకుంటాం. ఆ రోజు అందరికీ పబ్లిక్ హాలిడే కూడా ఉంటుంది.
ఢిల్లీలో పరేడ్ కూడా జరుగుతంది. దీనికి మన దేశంలో ప్రధాని, ఇతర నేతలు వస్తారు. అంతేకాదు వేరే దేశాల నుంచి ఒక ముఖ్య అతిధి కూడా వస్తారు. అయితే దేశం మొత్తం రిపబ్లిక్ డే ను జనవరి 26న జరుపుకుంటే ఒక్క చోట మాత్రం వేరే రోజున జరుపుకుంటారు.
అదెక్కడో మీకు తెలుసా. అసలు దీని గురించి ఎప్పుడైనా మీరు విన్నారా? లేదా అయితే ఆ విశేషం ఏంటో తెలుసుకుందాం రండి.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఓ ఆలయం ఉంది. అక్కడ మాత్రం రిపబ్లిక్ డే ను జనవరి 26న కాకుండా మరొక రోజున జరుపుకోనున్నారు. ఈసారి గణతంత్ర దినోత్సవాన్ని అక్కడ జనవరి 29న నిర్వహించనున్నారు.
ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు. గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం వివిధ తేదీలలో ఇక్కడ జరుపుకుంటారు. ఆలయ నిర్వాహకులు ఇలా చేయడం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.
ఉజ్జయినిలోని ఒక పెద్ద గణేష్ ఆలయం ఉంది. అక్కడ ఆలయాల్లో ఇదో ప్రముఖ గుడి. ఇక్కడ పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పండగలను మాత్రమే కాదు.. అనేక దశాబ్దాలుగా జాతీయ పండుగలను కూడా ఘనంగా జరుపుతున్నారు.
ఐతే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే జాతీయ పండుగలను తేదీల ప్రకారం కాకుండా ఇతర పండగల తరహాలో తిథుల ప్రకారం జరుపుతారు. పంచాంగం ప్రకారం.. .ఈసారి రిపబ్లిక్ డే తేదీ జనవరి 29న వస్తుంది.
అందుకే పెద్ద గణేష్ ఆలయంలో జనవరి 29న రిపబ్లిక్ డే జరుపుకోనున్నారు. తీజ్, పండుగలు, వార్షికోత్సవాలను ఇంగ్లీషు తేదీ ప్రకారం జరుపుకునే సంప్రదాయం మన ప్రాచీన గ్రంథాల్లో లేదని.. పంచాంగం ప్రకారం మాత్రమే జరుపుకోవాలని ఆలయ సేవకులు చెబుతున్నారు. ఈ ఆలయంలో ఎన్నో ఏళ్ళుగా ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నామని అంటున్నారు.
ఇక్కడి జ్యోతిష్య పండితులు ఆనంద్ శంకర్ వ్యాస్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం 1950, జనవరి 26న అమల్లోకి వచ్చిందని.. ఆ రోజు మాఘమాస శుక్ల పక్ష అష్టమి తిథి అని చెప్పారు. ఈసారి ఆ తిథి జనవరి 29న వస్తుంది.
అందుకే ఆ రోజునే గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటామని తెలిపారు. రిపబ్లిక్ డే రోజు దేశ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ.. వినాయకుడికి పూజలు చేస్తామన్నారు. ఏటా గణతంత్ర దినోత్సం రోజున ఆలయ శిఖరంపై కొత్త జెండాను ఎగురవేస్తామని, స్వాతంత్య్ర సమరయోధులను కూడా స్మరించుకుంటామని ఆయన చెప్పారు.
ఇక్కడ అన్ని పండుగలు తిధుల ప్రకారమే జరుపుతారుట. అయితే మామూలు పండుగలు అందరూ అలాగే చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లెమ్ ఏమీ లేదు కానీ జాతీయ దినాల దగ్గరే తేడా వస్తుంది.
గతేడాది కూడా ఫిబ్రవరి 9న ఇక్కడ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ రోజు ఆలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఉజ్జయినిలోని పెద్ద గణేష్ దేవాలయం 1908లో స్థాపించారు.
ఆ రోజు మాఘ కృష్ణ పక్ష చతుర్థి తిథి. పండిట్ నారాయణ్ వ్యాస్ ఈ ఆలయానికి పునాది వేశారు. స్వాతంత్ర పోరాటంలో టైమ్ లో సమరయోధులకు ఈ గుడి ఆశ్రయంగా కూడా ఉండేదిట. దేశ స్వాతంత్య్రాన్ని ఆకాంక్షిస్తూ ఇక్కడ అఖండ యాగాన్ని సైతం నిర్వహించారట.
0 Comments:
Post a Comment