Republic Day 2023 : భారత దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు.
దేశ సర్వసత్తాక సార్వభౌమత్వ దేశంగా మారిన రోజు. ఇదో చారిత్రక ఘట్టం. ఈ సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం గత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ కోడ్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసారు.
ఈ సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసారు. ప్రతి యేడాది గణతంత్య్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగరవేయం ఆనవాయితీ వస్తోంది. ఈ సందర్భంగా ఫ్లాగ్ కోడ్‌లోని మార్పులు ఏంటో చూద్దాం.
గతేడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంతకు ముందు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయవచ్చు. అయితే.. ఇపుడు దానికి 24 గంటలు ఎగరవేయవచ్చు
గతంలో మెషీన్‌తో తయారు చేసిన, పాలిస్టర్ జెండాలను ఉపయోగించడానికి వీలు లేదు. ఇపుడు ఖాదీ (ఖద్దరు)తో పాటు పాలిస్టర్, ఉన్ని, పట్టుతో తయారు చేసిన ఏ జెండానైనా ఎగరవేయవచ్చు. అందుకు అనుగుణంగా మన జాతీయ పతాకానికి సంబంధించి ఫ్లాగ్ కోడ్‌ను కేంద్రం సవరించింది.
2002 సంవత్సరానికి ముందు సాధారణ ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున మాత్రమే జాతీయ జెండాను ఎగరవేయడానికి అనుమతి ఉండేది.
కానీ 2002లో భారత జాతీయ పతాకానికి సంబంధించి జెండా కోడ్‌లో మార్పులు చేశారు. దీని ప్రకారం సాధారణ ప్రజానీకం ఏ రోజునైనా జాతీయ జెండాను ఎగరవేయవచ్చు.
త్రివర్ణ పతాకం సైజ్ 2:3 నిష్ఫత్తిలో ఉండాలి. దీంతో పాటు జాతీయ జెండాను సరైన క్రమంలో ఎగరవేయాలి. రివర్స్‌గా ఎగురవేయడం వంటివి చేయకూడదు.
జాతీయ జెండాను ఎపుడు నీటీలో ముంచవద్దు. జెండా చిరిగినా లేదా మురికిగా మారినట్లయితే.. దానికి చట్ట ప్రకారం డిస్పోజ్ చేయాలి. జాతీయ జెండా కంటే మరే ఇతర జెండా ఎక్కువ ఎత్తులో ఎగరకూడదు.
జెండాపై ఏదైనా రాయడం, సృష్టించడం, తొలగించడం చట్టవిరుద్ధం.. త్రివర్ణ పతాకాన్ని వాహనం వెనక, విమానంలో లేదా ఓడలో పెట్టకూడదు. జాతీయ పతాకాన్ని ఏ వస్తువులు లేదా భవనాలను కవర్ చేయడానికి ఉపయోగించరాదు. ఎట్టి పరిస్థితుల్లో భారత జాతీయ పతాకం నేలను తాకకూడదు. త్రివర్ణ పతాకాన్ని ఏ విధమైన యూనిఫాం లేదా అలకరణ కోసం ఉపయోగించరాదు.
భారత జాతీయ జెండాను ప్రదర్శించడం, ఎగురవేయడం మరియు ఉపయోగించడం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002 మరియు జాతీయ గౌరవానికి అవమానాల నివారణ ద్వారా నిర్వహించబడుతుందని చెప్పారు. చట్టం, 1971. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002, జూలై 20, 2022 నాటి ఆర్డర్ మరియు 2002 ఫ్లాగ్ కోడ్ యొక్క పార్ట్-IIలోని 2.2 పేరాలోని క్లాజ్ (xi) ద్వారా మరింత సవరించబడింది:- (xi ) "ది జెండాను బహిరంగ ప్రదేశంలో ప్రదర్శించాలి లేదా ప్రజల ఇంటిపై ప్రదర్శించాలి, దానిని పగలు మరియు రాత్రి ఎగురవేయవచ్చు."
ఫ్లాగ్ కోడ్‌లోని మరో నిబంధన సవరించబడింది, "జాతీయ జెండా చేతితో లేదా యంత్రంతో తయారు చేయబడుతుంది. ఇది పత్తి, పాలిస్టర్, ఉన్ని, సిల్క్ ఖాదీతో తయారు చేయబడుతుంది. అంతకుముందు యంత్రంతో తయారు చేయబడిన మరియు పాలిస్టర్‌తో తయారు చేయబడిన జాతీయ జెండాలకు ప్రవేశము లేదు.
జాతీయ గౌరవచిహ్నాల పరిరక్షణ (అవమాన నిరోధక) చట్టం -1971లోని నిబంధనల ప్రకారంజాతీయ జెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను, స్వాతంత్య్ర సమర యోధులను గౌరవించడం పౌరుల ప్రాథమిక విధి. ఈ దేశం మనది. మనందరిది కాబట్టి, ఆవిధులలో కొన్ని.. జాతీయ జెండా పొడవు వెడల్పు మూడు: రెండు నిష్పత్తిలో ఉండాలి. జెండాకు తొమ్మిది రకాల కొలతలున్నాయి.
1) 6300×4200 మిల్లీమీటర్లు. 2) 3600×2400 మిల్లీమీటర్లు. 3) 2700×1800 మిల్లీమీటర్లు. 4) 1800×1200 మిల్లీమీటర్లు. 5) 1350×900 మిల్లీమీటర్లు. 6) 900×600 మిల్లీమీటర్లు. 7) 450×300 మిల్లీమీటర్లు. 8) 225×150 మిల్లీమీటర్లు. 9) 150×100 మిల్లీమీటర్లు. ఇందులో చాలా పెద్ద సైజు 6300×4200 మిల్లీమీటర్లు. చిన్న సైజు 150×100 మిల్లీమీటర్లు.
భారత జాతీయ పతాకంలోని కాషాయపు రంగు పై భాగాన ఉండేటట్లు జెండాను కట్టాలి. పతాక వందనానికి హాజరైన పౌరులందరు ప్రజలందరు జెండాకు ఎదురుగా సావధానులై నిశ్శబ్ధంగా నిలబడి వందనం చేయాలి.
జెండా పైకి ఎగురవేసేటప్పుడు వడివడిగా ఎగరవేయాలి. పతాకం ఎగురగానే పౌరులందరూ ముక్తకంఠంతో జాతీయగీతాన్ని ఆలపించాలి.
గతంలో ఏదో ప్రత్యేక సందర్భాలలో తప్ప సాధారణంగా సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడుఅస్తమించే వరకు జెండా ఎగురుతుండాలి. అలాగే దించేటప్పుడు మెల్లగా నిదానముగా క్రిందకుదించాలి.
ఇతర దేశాల జెండాలతో మరియు ఏదైనా జెండాలతో కలిసి మన జాతీయ జెండాను ప్రదర్శించాల్సివస్తే అన్నింటి కంటే కుడి భాగాన ఉండాలి.ఊరేగింపుగా వెళ్లుతున్నప్పుడు ముందు భాగానికి కుడివైపుగా జెండా ఉండాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన భవనాల మీద అనగా హైకోర్టు, గవర్నర్ సచివాలయం, ముఖ్యమంత్రి, సచివాలయం, కమీషనర్ల కార్యాలయాలు, పోలిస్ కమీషనరేట్ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు, జిల్లా పోలిస్ కార్యాలయాలు, జిల్లా ప్రజా పరిషత్తులు,మున్సిపాలిటీలు.మెదలైన ప్రభుత్వ భవనాలపై ప్రతి రోజు జాతీయ పతాకం ఎగురవేయాలి.
2002 జనవరి 26 నుండి ఈ క్రింది నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఆ నియమ నిబంధనావళి ప్రకారం ప్రజలు, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు జాతీయ పతాకాన్ని సంవత్సరం పొడవునా స్వేచ్చగా ఎగురవేయవచ్చు. తాాజగా జాతీయ పతాకానికి సంబంధించిన కేంద్రం సవరణలు చేసింది.
దేశానికి చెందిన ప్రముఖ నాయకులు, ఉన్నత పదవులలో విధులు నిర్వహించే వ్యక్తులలో ఎవ్వరైనామృతి చెందితే వారి మృతికి గౌరవంగా సంతాపం తెలపడానికి సగానికి దించాలి. అవనతం చేయాలి. అది కూడా ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాల వరకే.
0 Comments:
Post a Comment