ప్రైవేట్ స్కూళ్ళను రద్దు చేయటమే పరిష్కారం! ఆకునూరి మురళి,IAS
_నాణ్యమైన విద్య అందాలంటే దేశంలో ప్రైవేట్ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే పరిష్కార మార్గంగా కనపడుతుంది. అప్పుడు ముఖ్యమంత్రుల పిల్లలు, మనుమలూ మనుమరాళ్ళు, అధికారుల పిల్లలు, ధనవంతుల పిల్లలు, పేద వారి పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో మాత్రమే చదివించాల్సి వుంటుంది. దాంతో బడుల పని విధానం, సౌకర్యాలు, విద్య నాణ్యత అన్నీ మెరుగవుతాయి. మండలానికి ఆరు నుండి పది పాఠశాలలు పెట్టి మిగతా చిన్న గ్రామాలకు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాలల సంఖ్య తక్కువై, సౌకర్యాలు మెరుగై విద్యాప్రమాణాలను పెంపొందుతాయి...._
భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్టు ప్రభుత్వమే అందరికీ నాణ్యమైన విద్యను అందించాలి. ఏ దేశంలో అయినా పేదరికం పోయిందంటే, బాగా అభివృద్ధి జరిగిందంటే దానికి పునాది పాఠశాల విద్య, కాలేజి విద్య, విశ్వవిద్యాలయ విద్య అనేది చారిత్రక సత్యం. కానీ మన దేశంలో ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టులకిచ్చే ప్రాజెక్టు పనుల మీద ఉన్నంత శ్రద్ధ పిల్లలకు నాణ్యత కల్గిన చదువు చెప్పించడం మీద పెట్టలేకపోతున్నారు....
0 Comments:
Post a Comment