✍️మెమోలు.. సస్పెన్షన్లు
♦️విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చర్యలు
*🌻బొబ్బిలి, న్యూస్‌టుడే*: నిర్లక్ష్యం వహించిన అధికారులు, ఉపాధ్యాయులకు మెమోలు, సస్పెండ్ ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ పర్యటన శుక్రవారం విజయనగరం జిల్లాలో సాగింది. బొబ్బిలిలోని నరేంద్రదేవ్ పాఠశాలలో పరీక్షల జవాబు మూల్యాంకన పత్రాలను ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయని ఉపాధ్యాయుడు ప్రవీణ్‌ను సస్పెండ్ చేశారు. పాఠశాలలో బెంచీలు అరకొరగా ఉండడానికి ఉన్నతాధికారులదే బాధ్యత వహించాలంటూ ఆర్జేడీ జ్యోతికుమారికి ఛార్జిమెమో, ఎస్ఎస్ఏ ఏపీసీ అప్పలనాయుడికి మెమో ఇవ్వాలని కలెక్టర్ సూర్యకుమారిని ఆదేశించారు. ఇదే మండలం పిరిడి గ్రామ ఉన్నత పాఠశాలలో సిలబస్ సకాలంలో పూర్తి చేయలేదంటూ ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, డిప్యూటీ డీఈవో తిరుపతినాయుడు, డీఈవో లింగేశ్వరరెడ్డికి షోకాజ్ నోటీసులివ్వాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. శుద్ధజలం ప్లాంటు సక్రమంగా పనిచేయకపోవడంపై సరైన సమాధానం చెప్పని ఈఈ భాస్కరరావు, డీఈ వేణుగోపాలరావు, ఏఈ శ్రీరామ్మూర్తిలకు మెమోలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు.
0 Comments:
Post a Comment