ప్రమాదాల్లో, క్రీడల్లో తగిలే గాయాలతో దెబ్బతిన్న మోకాళ్లకు అద్భుతమైన చికిత్సా మార్గం ''ప్లాస్మాథెరపీ'
రోడ్డు ప్రమాదాలు, క్రీడల్లో తగిలే దెబ్బలు.. వీటితో మోకాళ్లు దెబ్బతిన్నప్పుడు, వైద్యులు ఎమ్మారై చేసి, వెంటనే సర్జరీని ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ ఎముకలు (బోన్స్) విరిగినప్పుడు మినహా లిగమెంట్లు, కండరాలు, మెనిస్కస్, కార్టిలేజ్ (మృదులాస్థి).. ఇవి దెబ్బతిన్నప్పుడు వెనువెంటనే సర్జరీ చేయడం వల్ల దీర్ఘకాలంలో ముందుగానే కీళ్ల అరుగుదల మొదలవుతుంది.
మరి అలాంటప్పుడు ఆ గాయాలను అలాగే వదిలేస్తే ఎలా అనుకుంటున్నారా? నొప్పి, వాపు తగ్గేవరకూ ఆగి, ఆ గాయాలను నయం చేసే ప్లాస్మా చికిత్స తీసుకోవాలి.
సాధారణంగా ప్రమాదాల్లో మోకాలికి దెబ్బ తగిలినప్పుడు ఎముక లేదా కండరం దెబ్బతినవచ్చు. ఎసియల్/పిసియల్ లిగమెంట్ లేదా మెనిస్కస్ గాయపడవచ్చు. ఈ నాలుగు నిర్మాణల్లో ఏది దెబ్బతిన్నా గాయం తీవ్రతను బట్టి నొప్పితో పాటు, మోకీలు అస్థిరంగా మారవచ్చు.
మోకాలికి దెబ్బ తగిలిన వెంటనే వాపు, నొప్పితో అల్లాడిపోతాం. వైద్యుల సూచన మేరకు ఎమ్మారై తీయించుకుంటాం. దాన్లో మోకాలి లోపలి మృదువైన నిర్మాణాలు దెబ్బతినడం కనిపిస్తుంది. ఎముక విరిగితే దాన్ని సర్జరీతో అతికించక తప్పదు.
కానీ లిగమెంట్లు లేదా కండరం, మెనిస్కస్ దెబ్బతిన్న సందర్భాల్లో డాక్టర్లు సర్జరీలో భాగంగా, వాటిని కలిపి కుట్టే ప్రక్రియను అనుసరిస్తూ ఉంటారు. నిజానికి ఈ గాయాలకు సర్జరీ అవసరం లేదు.
సర్జరీ ఎప్పుడు అవసరమంటే...
దెబ్బ తగిలిన తర్వాత ఆరు వారాలు ఆగగలిగితే, నొప్పి, వాపు తగ్గుతాయి. చిన్న చిన్న కండరాల గాయాలు కూడా అదుపులోకి వస్తాయి. ఆరు వారాల తర్వాత మళ్లీ ఎమ్మారై తీయించుకున్నప్పుడు ఎసియల్ గాయం కనిపించినా, నొప్పి లేనప్పుడు దాన్ని అలాగే వదిలేయవచ్చు. అలా కాకుండా కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే సర్జరీని ఆశ్రయించాలి. అవేంటంటే...
- ఎసియల్ డ్యామేజ్: సాధారణంగా ప్రమాదంలో ఎసియఎల్ దెబ్బతిన్నప్పుడు, వెంటనే సర్జరీ చేసి కలిపి కుట్లు వేసేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆరు వారాల పాటు ఆగి, ఆ తర్వాత, నడకలో స్థిరత్వం తప్పుతున్పప్పుడు మాత్రమే సర్జరీని ఆశ్రయించాలి.
- మెనిస్కస్ డ్యామేజ్: సాధారణంగా ప్రమాదంలో ఈ నిర్మాణం దెబ్బతిన్నప్పుడు సర్జరీ చేసి, తెగిన మెనిస్కస్ ముక్కను పీకేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఇలాంటప్పుడు కూడా ఆరు వారాల పాటు ఆగి, నడుస్తున్న సమయంలో కాలు పట్టుకు పోతున్నప్పుడు (లాక్) మాత్రమే సర్జరీని ఆశ్రయించాలి.
ఇలా కేవలం నడక పట్టు తప్పుతున్నప్పుడు, కీలు పట్టుకుపోతున్నప్పుడు మాత్రమే సర్జరీని ఆశ్రయించాలి.
సర్జరీతో నష్టాలు ఇవే!
లిగమెంట్ తెగినప్పుడు సర్జరీతో అతికించుకోకపోతే ఎలా అనుకోవచ్చు. కానీ సర్జరీతో ఎలాంటి ఉపయోగం లేకపోగా, తగిలిన గాయం మూలంగా, సర్జరీ మూలంగా రెండు విధాలా మృదులాస్థికి నష్టం జరిగి, త్వరగా అరిగిపోవడం మొదలుపెడుతుంది. దాంతో మోకీలు ఆరిగిపోయి, మోకాలి మార్పిడి సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీతో మోకాలికి జరిగే ప్రధాన నష్టం ఇదే!
దెబ్బతిన్న ఎసియల్, మెనిస్కస్‌లకు సమర్థమైన ప్లాస్మా చికిత్స
ప్రమాదాల్లో దెబ్బతిన్న ఎసియల్, మెనిస్కస్, కండరాలను సరి చేసుకోవాలి. వాటిని అలాగే విదిలేస్తే, భవిష్యత్తులో అవే నిర్మాణాల్లో సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి త్వరగా మోకాలు అరిగిపోయేలా చేసే సర్జరీకి వెళ్లడానికి బదులుగా, సురక్షితమైన 'ప్లాస్మా థెరపీ'ని ఆశ్రయించాలి. దెబ్బతిన్న మోకాలి లోపలి నిర్మాణాలు భవిష్యత్తులో ఇబ్బంది పెట్టకుండా ఉండడమే ప్లాస్మా థెరపీ ప్రధాన లక్ష్యం. ఒక వారం లోపు గాయం కూడా మానడం మొదలుపెడుతుంది. అలా వారం నుంచి పది రోజుల పాటు ఆగి, ప్లాస్మా థెరపీ చేయించుకోవాలి.
గాయం తీవ్రతను బట్టి 15 రోజుల వ్యవధితో, ఒకటి నుంచి నాలుగు ప్లాస్మా థెరపీలు తీసుకోవలసి ఉంటుంది. ఇలా ప్లాస్మా థెరపీ చేయించుకోవడం వల్ల మోకాలి లోపలి నిర్మాణాలు దెబ్బతినకుండా ఉంటాయి. కాబట్టి సర్జరీలో మాదిరిగా, భవిష్యత్తులో మోకాలు అరిగిపోయే సమస్య ఉండదు. సర్జరీ చేయించుకున్నప్పుడు కనీసం నెల రోజుల పాటు నడిచే అవకాశం ఉండదు. నొప్పి, సర్జరీ తదనంతర ఇన్‌ఫెక్షన్లు కూడా వేధిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా మోకాలు త్వరగా అరిగిపోతుంది.
ఈ దుష్ప్రభావాలేవీ ప్లాస్మా థెరపీలో ఉండవు. పైగా దెబ్బతిన్న మోకాలి లోపలి ఎసియల్, లేదా మెనిస్కస్‌లు మెరుగై, మునుపటిలా నడవగలుగుతారు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
గమనిక: రోగి రక్తాన్ని చిన్న ఇంజెక్షన్ ద్వారా సేకరించి ప్లాస్మా థెరపీ చేయడం జరుగుతుంది. మొత్తం చికిత్స కేవలం అరగంటలోనే పూర్తవుతుంది.
డాక్టర్ సుధీర్ దారా
MBBS, MD IAPM
ఫౌండర్, డైరెక్టర్ ఆఫ్ EPIONE,,
సెంటర్ ఫర్ పెయున్ రిలీఫ్ అండ్ బియాండ్,
నాలుగవ అంతస్తు అపురూప పిసిహెచ్,
రోడ్ నెంబరు 2,బంజారాహిల్స్, హైదరాబాద్ -33
ఫోన్: 875-875-875-1, 84660 44441
90908 88822, చెన్నై: 76313 76313
0 Comments:
Post a Comment