కశ్మీర్ లోని గుల్మార్గ్ ప్రస్తుతం మంచుతో కప్పబడి ఉంటుంది.
అయితే గుల్మార్గ్ లోని గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్ గుల్‌మార్గ్ హిమపాతం కంటే ఎక్కువ మందిని ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ గాజు గోడల రెస్టారెంట్‌లో పర్యాటకులు ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు,సెల్ఫీలు ఫోటోలు తీసుకోడానికి ఇష్టపడుతున్నారు.
ఈ ప్రత్యేకమైన గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్‌ను హోటల్ కొలాహోయ్ గ్రీన్ హైట్స్ రూపొందించింది. వ్యాలీలో ఇది మొదటి గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్ అని హోటల్ పేర్కొంది. దీనికి ముందు హోటల్ కొలాహోయ్ గ్రీన్ హైట్స్ వ్యాలీలో మంచుతో కప్పబడిన మొదటి రెస్టారెంట్‌ని నిర్మించింది.
హోటల్ మేనేజర్ హమీద్ మసౌదీ ప్రకారం.. గుల్మార్గ్‌ను పర్యాటకులకు ఆకర్షణీయంగా మార్చడానికి ఎల్లప్పుడూ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. 2020లో ఆసియాలోనే అతిపెద్ద ఇగ్లూను హోటల్ తాము నిర్మించిందని ఆయన చెప్పారు. ఈసారి గ్లాస్ ఇగ్లూ తయారు చేయబడిందని, ఇది కాశ్మీర్‌లో మొదటి ఇగ్లూ అని తెలిపారు.
కశ్మీర్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిన్‌లాండ్ లో ఉన్న ఇలాంటి నిర్మాణాన్ని ప్రేరణగా తీసుకుని తన హోటల్ ప్రాంగణంలో మూడు ఇగ్లూలను నిర్మించినట్లు మసౌదీ తెలిపారు. గుల్‌మార్గ్‌లో మొదటి దశలో మూడు ఇగ్లూలను నిర్మించాము, వీటిని ప్రజలు బాగా ఇష్టపడుతున్నారన్నారు.
ఈ గ్లాస్ ఇగ్లూస్‌లో ఒకేసారి 8 మంది కూర్చోవచ్చని మసౌదీ తెలిపారు. పర్యాటకులకు విభిన్నమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ ప్రత్యేకమైన రెస్టారెంట్ పర్యాటకులతో పాటు స్థానికులకు కూడా బాగా నచ్చింది.
తాను కశ్మీర్ వ్యాలీని సందర్శించేందుకు వచ్చానని, గుల్‌మార్గ్‌లో గడపాలనుకుంటున్నానని ఓ పర్యాటకుడు చెప్పాడు. అతను ఈ రెస్టారెంట్‌ని కనుగొన్నప్పుడు, అతనికి చాలా భిన్నమైన అనుభవం ఎదురైంది. అందులో కూర్చుంటే స్వర్గపు కిటికీలోంచి చూస్తున్నట్లు అనిపించిందని సైఖ్ అనే పర్యాటకుడు చెప్పాడు. ఈ గాజుతో కప్పబడిన రెస్టారెంట్‌లో చల్లగా ఉండదు. ఒక కప్పు కాఫీతో బయటి దృశ్యం మరింత అద్భుతంగా కనిపిస్తుంది.
0 Comments:
Post a Comment