భారతదేశంలో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి, ఇవి చాలా మందిని ఆకర్షిస్తాయి.
మరోవైపు, నార్త్ ఈస్ట్ గురించి మాట్లాడినట్లయితే, ఇక్కడ చాలా అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు..టూరిస్ట్ లు ఎంతగానో ఎంజాయ్ చేసే చాలా ఉత్తమ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా చెప్పవచ్చు.
నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో పర్యటన పర్యాటకులకు చాలా అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది.
ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ అద్భుతమైన పర్యాటక ప్రదేశాలకు నిలయం. అయితే ఈ రాష్ట్రంలో ఉన్న అనిని అని పిలువబడే ఓ ప్రదేశం స్విట్జర్లాండ్ కంటే తక్కువ కాదు అన్నట్లుగా ఉంటుంది.
ఈ ప్రదేశం యొక్క కొన్ని ఫొటోలను నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది మరియు చుట్టూ మంచుతో కప్పబడి ఉంది.
నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా ట్విట్టర్ లో ఈ ఫొటోలను షేర్ చేస్తూ..."ఇది స్విట్జర్లాండ్ లేదా కాశ్మీర్ కాదు! ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని అనినిలో ఇటీవల నిర్మించిన చిగు రిసార్ట్.
అద్భుతమైన సైట్ కదా? @PemaKhanduBJP జీ మీరు నన్ను ఎప్పుడు ఆహ్వానిస్తున్నారు? సందర్శించడానికి సంప్రదించండి: https://arunachaltourism.com"అని పేర్కొన్నారు.
మంత్రి అభ్యర్థనపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ వెంటనే స్పందించారు. అరుణాచల్ సీఎం ట్వీట్ చేస్తూ..ప్రియమైన @AlongImnaజీ, అందమైన 'ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్' లో మీకు ఎల్లప్పుడూ స్వాగతం.
ఇక్కడి పర్వతాలు, లోయలు వాటి అందాలతో మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. చిగు రిసార్ట్ మంచుతో కప్పబడిన పర్వతాలు, పైన్ చెట్లతో అందమైన నేపథ్యాన్ని కలిగి ఉంది. అరుణాచలం నీ రాక కోసం ఎదురుచూస్తోంది! తప్పక రావాలి" అని తెలిపారు.
అనిని పట్టణం..అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని దిబాంగ్ వ్యాలీ జిల్లాకు ప్రధాన పరిపాలనా కార్యాలయం.అనిని అవిభక్త దిబాంగ్ వ్యాలీ జిల్లాకు, జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది ఒక చిన్న అభివృద్ధి చెందని పట్టణం.
0 Comments:
Post a Comment