Pathaan movie in Kashmir : ఉగ్రదాడులు, ఎన్కౌంటర్లతో నిత్యం అల్లకల్లోలంగా ఉండే కశ్మీర్లో పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తున్నాయి.
అక్కడ కనిపిస్తున్న 'పఠాన్' మేనియా ఇందుకు కారణం! బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం.. కశ్మీర్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఎంతలా అంటే.. 32ఏళ్లల్లో తొలిసారిగా అక్కడి థియేటర్లలో 'హౌజ్‌ఫుల్' బోర్డు కనిపించేంతగా!
కశ్మీర్‌కు కొత్త జోష్..!
పఠాన్ సినిమా షారుక్ ఖాన్ కెరీర్లో అత్యంత కీలకం! బాలీవుడ్ బాద్షా.. ఓ హిట్ కొట్టి చాలా ఏళ్లు గడిచిపోయింది. ఇప్పుడు పఠాన్‌కు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వస్తుండటంతో ఎట్టకేలకు షారుక్ ఖాతాలో హిట్ పడినట్టు అయ్యింది.
అయితే.. ఈ పఠాన్.. షారుక్ ఖాన్‌కే కాదు, కశ్మీర్‌కు కూడా ప్రత్యేకమే! పఠాన్ కారణంగా.. కశ్మీర్‌లోని థియేటర్లు కళకళలాడుతున్నాయి. 32ఏళ్ల తర్వాత.. అక్కడ 'హౌజ్‌ఫుల్' బోర్డు కనిపించడం విశేషం.
Pathaan movie collections : "ఇప్పుడు దేశంలో పఠాన్ ట్రెండ్ నడుస్తోంది. 32ఏళ్ల తర్వాత కశ్మీర్ లోయలో హౌజ్‌ఫుల్ బోర్డును తీసుకొచ్చిన కింగ్ ఖాన్‌కు ధన్యవాదాలు," అని ఐనాక్స్ ట్వీట్ చేసింది.
బుక్‌మైషోలో ఐనాక్స్ శ్రీనగర్ శివ్పోరా థియేటర్‌ను చూస్తే.. అక్కడ పఠాన్‌కు లభిస్తున్న క్రేజ్ అర్థమవుతుంది. శుక్రవారం ఆ థియేటర్లో పఠాన్‌కు సంబంధించి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఐదు షోలు వేస్తున్నారు.
వీటిల్లో చాలా వరకు హౌజ్‌ఫుల్ అయిపోయాయి. మిగితావి.. ఫిల్లింగ్ ఫాస్ట్‌గా ఉన్నాయి. ఇక వీకెండ్ వస్తుండటంతో 28, 29 తేదీల్లోనూ కశ్మీర్లో థియేటర్లు కిటకిటలాడుతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Kashmir Inox Theatre : కశ్మీర్ ఐనాక్స్‌లో మూడు స్క్రీన్లు ఉన్నాయి. 520కుపైగా సీటింగ్ కెపాసిటీతో ఇవి నడుస్తున్నాయి. ఫుడ్ కోర్ట్ వంటివి కూడా ఐనాక్స్‌లో ఉన్నాయి.
షారుక్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన పఠాన్ సినిమా.. జనవరి 25న విడుదలైంది. కశ్మీర్లో తొలి రోజు అన్ని షోలు హౌజ్‌ఫుల్ అయ్యాయి! 32ఏళ్ల తర్వత ఇలా జరుగుతుండటంతో.. అక్కడి వ్యాపార వర్గాల్లో కొత్త కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
2022 సెప్టెంబర్‌లో..
Shah Rukh Khan Pathaan movie : తీవ్ర అలజడుల మధ్య కశ్మీర్‌లోని థియేటర్లు దాదాపు 30ఏళ్లు మూతపడే ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో కొన్ని థియేటర్ల్ రీఓపెన్ అయ్యాయి. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ ఛద్దా సినిమాతో అక్కడి బాక్స్ఆఫీస్ మళ్లీ పరుగులు తీసింది.
వాస్తవానికి కశ్మీర్ లోయలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావు! 1980 చివరి వరకు.. ఇక్కడ 12కుపైగా థియేటర్లు ఉండేవి. మిలిటెంట్ బృందాల బెదిరింపులతో.. థియేటర్లను మూసివేయక తప్పలేదు. ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్టు కనిపిస్తోంది.
0 Comments:
Post a Comment