కొంతమంది ఏ మాత్రం గ్యాప్ దొరికినా పదేపదే ముక్కులో వేలు పెట్టుకుంటూ ఉంటారు. ముక్కు దురద పెడుతుందనో.. ముక్కులో పక్కులు తీయడానికో అలా ముక్కులో వేలు పెట్టి తిప్పుతూ ఉంటారు.
కానీ దీన్ని ఒప్పుకునేవాళ్ళు చాలా తక్కువ. కొందరు అనుకోకుండా దొరికిపోయి ఆ తరువాత షేమ్‌గా ఫీలవుతుంటారు.
అయితే.. ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్లు.. కేవలం ఎవరో ఏదో అంటారని కాదు కానీ తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వదిలిపెట్టేయాలి.
ఈ అలవాటు అంత మంచిది కాదు. ఆ అలవాటు చాలా డేంజర్‌కు దారితీస్తుందని చెబుతున్నారు డాక్టర్లు, పరిశోధకులు. అల్జీమర్స్ , చిత్తవైకల్యం వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
గ్రిఫిత్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ పరిశోధన ఎలుకలపై జరిగింది. మన ముక్కులో ఘ్రాణ నాడి ఉంటుంది. ఇది నేరుగా మన మెదడుతో అనుసంధానించబడి ఉంటుంది.
ముక్కులో వేలు పెట్టినప్పుడు.. ఈ ఘ్రాణ నాడి ద్వారా బ్యాక్టీరియా, వైరస్ లు నేరుగా మెదడులోని కణాలకు చేరుతాయి. దీంతో మెదడు వ్యాధులు వస్తాయి. చిత్తవైకల్యం నాడీకి సంబంధించిన ఒక రుగ్మత.
దీనిలో మెదడు నరాలు కుంచించుకుపోయి కణాలు నాశనం అవుతుంటాయి. చిత్తవైకల్యం వల్ల మెదడు హిప్పోకాంపస్ భాగం ఎక్కువగా ప్రభావితమవుతుంది.
ఇది విషయాలను గుర్తించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ చిత్తవైకల్యం వల్ల జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది.
ముక్కు మనకు గాలి పీల్చడానికి, వాసన చూడటానికి ఉపయోగపడే జ్ఞానేంద్రియం. మనం గాలి పీల్చుకున్నప్పుడు మన ముక్కులో ఉండే వెంట్రుకలు గాలిని ఫిల్టర్ చేస్తాయి. ధుమ్ము, ధూళి, బాక్టీరియా వంటివి లోనికి వెళ్శకుండా అడ్డుకుంటాయి.
అలాగే ముక్కులో ఉండే మ్యూకస్ మైంబ్రేన్ బయటకు వెళ్ళకుండా చేస్తాయి. ఈ క్రమంలోనే మనం పరిశుభ్రమైన గాలిని పీల్చుకోగలుగుతున్నాం.
అయితే ముక్కులో తరచూ వేళ్ళు పెట్టుకునే అలవాటు ఉన్నవారిలో ముక్కు వెంట్రుకల దగ్గర ఆగిపోయిన బాక్టీరియా తిరిగి లోపలికి వెళుతుంది.
ఇది నేరుగా మెదడును, ఊపిరితిత్తులను చేరే ప్రమాదం కూడా ఉంది. బాక్టీరియా మెదడును చేరితే వాసన చూసే సామర్థ్యం కోల్పోతారని తెలిసింది.
అంతేకాదు దీనివల్ల ఎంతో భయంకరమైన అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదముందట. ఇక బాక్టీరియా ఊపిరితిత్తులను చేరితే దానివల్ల న్యుమోనియా వంటి జబ్బులు వస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి ముక్కుల్లో వేలు పెట్టుకునే అలవాటు ఉంటే దాన్ని తక్షణమే వదిలేయండి.
0 Comments:
Post a Comment