New year temples న్యూ ఇయర్ ఫస్ట్ డేకి ఈ ఆలయాలు ఎంతో ప్రసిద్ధి..
ప్రతి కొత్త సంవత్సరాన్ని స్వాగతించడం అంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది. అయితే అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ కొత్త ఏడాది మొదటి రోజునాడు.. కొంతమంది కొన్ని దేవాలయాలకు వెళ్తుంటారు. అలాంటివాటిలో ఈ దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
2023 మొదటి రోజును ప్రత్యేకంగా మార్చాలని అందరూ కోరుకుంటారు. మనలో చాలామంది కొత్త సంవత్సరాన్ని భగవంతుని దర్శనంతో ప్రారంభించాలని ఆశిస్తారు. మధ్యప్రదేశ్‌లోని కొన్ని దేవాలయాలను దర్శించడం ద్వారా కొత్త సంవత్సరాన్ని సంతోషంగా ప్రారంభిస్తుంటారు కొందరు.
దేశంలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ మహాకాళేశ్వరంలో ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది.
ప్రత్యేక సందర్భాలలో లక్షలాది మంది భక్తులు బాబా మహాకాళుని దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు పొందేందుకు వస్తారు. కొత్త సంవత్సరంలో బాబా మహాకాల్ని దర్శించుకోవడం ద్వారా నూతన సంవత్సరాన్ని స్వాగతించవచ్చు. దీనితో పాటు, ఇటీవల ప్రారంభోత్సవం తర్వాత, సందర్శకుల కోసం తెరిచి ఉన్న మహాకాల్ లోక్‌ను సందర్శించడం ద్వారా మాల్వాలోని రుచికరమైన వంటకాలను ఆస్వాదించడం ద్వారా కొత్త సంవత్సరాన్ని ప్రత్యేకంగా జరుపుకోవచ్చు.
ఈ డివోషనల్ సిటీలో హరసిద్ధి ఆలయం, కాల భైరవ ఆలయం, చింతామన్ గణేష్ ఆలయం, మంగళనాథ్ ఆలయం వంటి అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి, వీటిని న్యూ ఇయర్ లో మొదటి రోజు కూడా సందర్శిస్తుంటారు. భోజ్‌పూర్ శివాలయం: భోజ్‌పూర్ శివాలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేయడం ద్వారా కుటుంబంతో కలిసి కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు.పర్మార్ రాజా భోజ్ నిర్మించిన ఈ ఆలయంలో దేశంలోనే అత్యంత ఎత్తైన 40 అడుగుల శివలింగం ఉంది.
జుగల్ కిషోర్ మందిర్
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా దేశ విదేశాల్లో విలువైన వజ్రాలకు ప్రసిద్ధి. నూతన సంవత్సరంలో పన్నాకు వెళ్తే జుగల్ కిషోర్ దేవుడి దర్శనం చేసుకోవచ్చు. ఓర్చాలో అనేక చారిత్రక కోటలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో కూడా చాలా ప్రధానమైంది. రామ రాజ మందిరం ఒకటి. ఇక్కడకు న్యూ ఇయర్ సందర్భంగా భక్తులు పోటెత్తుతుంటారు.
0 Comments:
Post a Comment