New Method On Copying: ఎగ్జామ్స్ అంటే కొందరు కష్టపడి చదువుతారు. మరికొందరు కష్టపడి కాపీ కొడతారు.
నిద్రాహారాలు మాని చదువుతారు కొందరు. మరికొందరు నిద్రాహారాలు మాని కాపీ కొట్టడానికి స్లిప్పులు తయారు చేస్తారు.
పరీక్షల్లో గట్టెక్కడానికి ఓ విద్యార్థిని చేసిన నిర్వాకం ఉపాధ్యాయుల్ని నివ్వెరపోయేలా చేసింది. ఆమె వినూత్న ఐడియాకి ఉపాధ్యాయులు షాక్ తిన్నారు.
New Method On Copying
పరీక్షలు అనగానే ఓ విద్యార్థిని కాపీ స్లిప్పులు తయారు చేసింది. ఏ ప్రశ్న వచ్చినా తన దగ్గర ఉన్న ఆన్సరే రాయాలని నిర్ణయించుకుంది. దీంతో తమ ఇంట్లో శుభకార్యం జరిగినట్టు బిల్డప్ ఇస్తూ.. చేతులకు మెహందీ పూసుకుంది.
ఆ మెహందీ డిజైన్ల మధ్యలో మ్యాథ్స్ ఫార్మాలాలు రాసిపెట్టింది. అవి కనపడకుండా ఫుల్ హ్యాండ్స్ డ్రస్ వేసుకుంది. పరీక్ష హాల్ లో ఫుల్ హ్యాండ్స్ పైకి కిందికి లాగుతుండటంతో ఎగ్జామినర్ కి అనుమానం వచ్చింది.
New Method On Copying
ఒక్కసారి తరచి చూస్తే ఆ స్టూడెంట్ భాగోతం బయటపడింది. మెహందీ డిజైన్ల మధ్యలో మ్యాథ్స్ ఫార్ములాలు బయటపడ్డాయి. ఆ విద్యార్థిని పేపర్ లాక్కుని ఎగ్జామినర్ బయటకు పంపేసింది.
కాపీ కొట్టడానికి ఆ విద్యార్థిని పడ్డ ఆపసోపాలు చూసి ఉపాధ్యాయులు నవ్వుకున్నారు. కాపీ కొట్టడానికి పడే కష్టం .. చదవడానికి పడితే ఈజీగా పాస్ అవుతారు కదా అని ఆ విద్యార్థినికి హితబోధ చేశారు.
0 Comments:
Post a Comment