న్యూదిల్లీ,జనవరి24 : జనగణమన అధినాయక జయహే .. ' అంటూ ఏ మూల నుండి సుమధురమైన ఆ శబ్ద తరంగాలు వినపడినా రోమాంచితం కాని భారతీయుడెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు .
విద్యార్థి దశలో ఓ భాగంగా నిలిచిపోయిన ఆ గీతానికి నిత్య నీరాజనాలర్పించేలా చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ ను స్మరించుకోవడం మనందరి కనీస బాధ్యత.ఆయన రచించిన ' గీతాంజలి ' గ్రంథానికి నోబెల్ బహుమతి వచ్చిన విషయం మనందరికి తెలిసిందే .
ఆ గ్రంథంలోని సుప్రసిద్ధ గీతమే ' జనగణమన ' అనే జాతీయ గీతంగా స్థిరపడింది. 1896 లో రాజ్యాంగ నిర్మాణ సభలో దీనిని ఆయన ఆలపించారు. స్వాతంత్యాన్రంతరం 1950 జనవరి 24 న ఈ గీతాన్ని అధికారికంగా జాతీయ గీతంగా ఆమోదించారు .
ఇందులో ఆసక్తికరమైన విషయమేమంటే సుమధురంగా వినిపించే ఈ గీతానికి తొలుత ఆంగ్లేయ మహిళ మార్గరేట్ కజిన్స్ స్వరకల్పన చేసిందని స్వయంగా ఆమె స్వీయ చరిత్రలో చెప్పుకుంది. మన జాతీయ గీతంలో మొత్తం ఐదు చరణాలుంటాయి .
అయితే మొదటి ఎనిమిది ఫంక్తులను మాత్రమే జాతీయ గీతంగా భారత ప్రభుత్వం గుర్తించింది . దీనిని లయబద్ధంగా పాడేందుకు 52 సెకండ్లు పడుతుంది. అంతకంటే ఎక్కువ తక్కువలున్నాయంటే మనం శృతి తప్పుతున్నామన్నమాటే.
ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఆ గీతాన్ని రవీంద్రుడు అవిభక్త భారతదేశంగా ఉన్నప్పుడు రచించారు. కాబట్టి అప్పటి దేశం లోని రాష్టాల్రను కలుపుతూ గీతం సాగిపోతుంది .
ఉదాహరణకు గీతంలోని ' సింధు ' ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది. ఇక మరాఠ అంటే మహారాష్ట్ర, ద్రావిడ అంటే తెలుగు, తమిళ, కర్ణాటక, కేరళ ప్రాంతాలని, ఉత్కళ అంటే ఒడిశా, వంగ అంటే బెంగాల్ అని అర్థం.
వాస్తవానికి వీటిన్నింటిని పాఠశాలల్లో జాతీయ గీతం శ్రద్ధగా పాడుతున్నప్పుడే ఉపాధ్యాయులు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆ కోణంలో మన విద్యావ్యవస్థ సాగిన దాఖలాలు మనకు మచ్చుకైన కనపడవు.
ఒక మహనీయుని కలం నుండి జాలువారిన జాతీయ గీతం వెనుక ఉన్న శ్రమ ఇప్పటి తరం వారికి చాలా వరకు తెలియదంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఉండదు.
0 Comments:
Post a Comment