Nara drusti - నరదృష్టితో బాధపడేవారు.. ఈ చిట్కాలతో నరదృష్టిని దూరం చేసుకోవచ్చా..
సాధారణంగా చాలామంది ప్రజలు వారి ఇంటికి వాస్తు నియమాలలో ఎటువంటి వాస్తు సమస్యలు లేకపోయినా,ఇలాంటి దోషాలు లేకున్నా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.
ఇలాంటి వారు నర దృష్టితో బాధపడుతున్నారని చాలా సందర్భాలలో చాలామంది చెబుతూ ఉంటారు. అసలు ఈ నర దృష్టి అంటే ఏంటి? ఎటువంటి చిట్కాలను పాటిస్తే నరదృష్టి దూరం అవుతుంది అనే విషయం గురించి జ్యోతిష్య శాస్త్రం ఎమి చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నరదృష్టి అంటే మనపై మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు పక్క వాళ్ళ విపరీతమైన ఆసక్తితో కూడిన ఫోకస్ ను నర దృష్టి అని చెబుతూ ఉంటారు. మనకు పక్కన వాళ్లతో పట్టింపు లేకుండా పక్కన వాళ్ళు మన గురించి పదే పదే ఆరా తీయడం కూడా నరదృష్టిగానే భావించవచ్చు. మీకేంటి అని పదే పదే మన విషయంలో ఎవరు అన్న కూడా దిష్టి అని చెప్పవచ్చు. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదు.
నర దృష్టికి నాపరాళ్ళు కూడా బద్దలు అవుతాయని నానుడి. నరదృష్టి ఎక్కువగా ఉన్నవారు ఇళ్ళలో ఎక్కువ ఎప్పుడు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే అటువంటి నరదృష్టి నుంచి బయటపడడం కోసం కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిదని చెబుతున్నారు.సాధారణంగా నరదృష్టి తగిలిందని భావించినప్పుడు చాలామంది కల్లు ఉప్పును మూడుసార్లు ఆ వ్యక్తిని చుట్టూ తిప్పి బయటపడేస్తుంటారు. కొంతమంది ఎండుమిరపకాయలు, చిపురు కట్ట ఉంటే వాటితో దిష్టి తీస్తూ ఉంటారు. ఇవి మాత్రమే కాకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నరదుష్టి తొలిగిపోవాలంటే మరికొన్ని చిట్కాలను చెబుతూ ఉన్నారు. విపరీతంగా నర దిష్టి ఉన్నవారు నిమ్మ కాయను సగం మధ్యలో కోసి కుంకుమ అద్ది గుమ్మానికి ఇరువైపులా ఉంచితే మంచిది. మంగళవారం రోజు ఇలా చేస్తే నరదృష్టి తొలగిపోతుంది. నరదృష్టి వల్ల రుణ బాధలు వస్తే వినాయకుడి దేవాలయంలో పూజలు చేస్తే నరదృష్టి మంచి ఉపశమనం లభిస్తుంది.
0 Comments:
Post a Comment