టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ (Nara Lokesh)'యువగళం' పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన నందమూరి తారకరత్న (Nandhamuri Tarakaratna) కొద్ది దూరం నడిచాక స్పృహ తప్పి కిందపడిపోయారు.
దీనితో తారకరత్నను హుటాహుటీన కుప్పం కేసి ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి పీఈఎస్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఐసీయూలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.
ఉదయం 11 గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాగా..ఈ పాదయాత్రలో బాలకృష్ణ, తారకరత్న పాల్గొన్నారు. ఈ క్రమంలో లక్ష్మీపురం సరి వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొద్ది దూరం నడిచాక మసీదులో ప్రార్ధనలు చేశారు. అయితే మసీదు నుండి బయటకు వచ్చే క్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చుట్టు ముట్టడంతో ఒత్తిడి తట్టుకోలేక తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి కుప్పకూలిపోయారు. ఆయనను ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్సలో భాగంగా సీపీఆర్ చేసిన వైద్యులు హార్ట్ బీట్ ను పునరుద్దరించినట్టు తెలుస్తుంది. ఇక తాజాగా కార్డియాలజీ వైద్యులు తారకరత్నకు వైద్యం అందిస్తున్నట్లు సమాచారం.
క్రిటికల్ గా తారకరత్న ఆరోగ్యం..
కాగా తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం క్రిటికల్ గా ఉన్నట్లు తెలుస్తుంది. వైద్యులు సీపీఆర్ చేసి కొంత కంట్రోల్ లోకి తెచ్చినా కూడా ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పల్స్ లేదు. ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశాం. 45 నిమిషాల తరువాత పల్స్ మొదలయింది. మా ప్రయత్నం మేము చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నాం అని వైద్యులు తెలిపారు. ఇక ఇప్పటికీ కూడా తారకరత్న స్పృహలోకి రాలేదని సమాచారం. ప్రస్తుతం వైద్యులు అతనికి యాంజియోగ్రామ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు తరలించే అవకాశాలు ఉన్నాయి.
కాగా తారకరత్న రాజకీయాల్లో యాక్టివ్ కావాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనీ భావించారట. ఇక పాదయాత్రలో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో టీడీపీ కార్యకర్తలు, తారకరత్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ సహా పలువురు కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.
కుటుంబ సబ్యులకు ధైర్యం చెబుతున్న బాలయ్య
ఇక తారకరత్న గురించి తెలియగానే నందమూరి బాలకృష్ణ వెంటనే ఆసుపత్రికి చేరుకొని వైద్యులతో మాట్లాడడం జరిగింది. అతని ఆరోగ్య విషయం గురించి ఎప్పటికప్పుడు వైద్యులు నందమూరి బాలకృష్ణకు తెలియజేస్తూనే ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా తన కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యం చెబుతూ తప్పకుండా తారకరత్న కొలుకుంటాడు అని వివరణ ఇస్తున్నారు.
బాలయ్య వివరణ
ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ తారకరత్న గురించి తెలియజేశారు. కుదిరితే తారకరత్నను బెంగళూరుకు తరలిస్తాం అంటూ అంబులెన్స్ లో తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతమైతే ఆందోళన చేద్దాల్సిన అవసరం లేదు అని డాక్టర్ల సూచనతోనే బెంగళూరుకి తరలిస్తామని గుండెల్లో ఎడమవైపు 90% వరకు బ్లాక్ అయ్యింది అని బాలకృష్ణ వివరణ ఇచ్చారు.
తారకరత్నకు ఏమి కాదు
ఇక మిగతా రిపోర్టులు బాగున్నాయని కుటుంబ సభ్యులు అలాగే అభిమానుల దీవెనలు తారకరత్నపు ఎప్పుడూ తోడుగా ఉంటాయి కాబట్టి ఆయనకు ఏమీ కాదు అని అధైర్య పడాల్సిన అవసరం లేదు అని బాలయ్య అన్నారు. ఇక తప్పకుండా తారకరత్న కోలుకొని మన ముందుకు వస్తారని కూడా బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ కాల్
ఇక నందమూరి బాలకృష్ణ కు ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే చాలామంది ఫోన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ కు ప్రత్యేకంగా ఫోన్ చేసి వారి అన్నయ్య ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా నందమూరి కళ్యాణ్ రామ్ కూడా బాలయ్య బాబుకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది.
0 Comments:
Post a Comment