ఉదయం లేవగానే..మొదట చేసేది పళ్లు తోముకోవడం. దీనితోనే మన దినచర్య ప్రారంభం అవుతుంది. అయితే మనలో కొంతమంది ఉదయం బ్రష్ చేసుకోకుండా పచ్చిమంచినీళ్లు కూడా ముట్టురు.
మరికొంతమంది మాత్రం ఉదయం లేవగానే బ్రష్ చేయకముదే మంచి నీళ్లు తాగుతారు. బ్రష్ చేసుకోకుండానే నీళ్లు తాగడం ఎంత వరకు మంచిది.
మన ఇంట్లో పెద్దవాళ్లు చెబుతుంటారు..బ్రష్ చేసుకోకుండానే మంచి నీళ్లు తాగితే శరీరంలో ఉండే మలినాలన్నీ తొలగిపోతాయని. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.
పళ్లుతోమకుండా మంచినీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
-ఉదయాన్నే లేచి బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా మంది భావిస్తారు. అయితే బ్రష్ చేయకుండానే మంచినీళ్లు తాగడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది. దీంతో రోజంతా ఏం తిన్నా అది సరిగ్గా జీర్ణం అవుతుంది. ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల అనేక రకాల వ్యాధులు నయం అవుతాయి.
- పళ్లు తోమకుండా ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల రోగనిరోధకశక్తి మెరుగుపడుతుంది. జలుబు, దగ్గు బ్రష్ చేయకుండానే నీళ్లు తాగాలి.
-మెరిసే చర్మం కావాలంటే ఉదయాన్నే మంచినీళ్లు తాగాలి. అలాగే మలబద్ధకం, నోటిలో బొబ్బలు, పచ్చిత్రేనుపు వంటి కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ ఉదయం నీరు తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుది.
-అధిక రక్తపోటు, షుగర్ పేషంట్లు అయితే.మీరు ఉదయాన్నే నీరు తాగాలి. అంతేకాదు బ్రష్ చేయకుండానే నీళ్లు తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది.
-నోటి దుర్వాసన సమస్యఉన్నవారు తప్పనిసరిగా ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగాలి. నోటిలో లాలాజలం లేకపోవడం వల్ల నోరు పూర్తిగా తడిగా మారుతుంది.
బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. దీంతో నోటిలో నుంచి దుర్వాసన వస్తుంది. ఉదయాన్నే నిద్రలేచి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే ఆ సమస్య నుంచి బయటపడతారు.
0 Comments:
Post a Comment