PVRNEWS777, జనవరి2, 2023: ప్రతి సమస్యకు ప్రధాన కారణం మనస్సు.. సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. ఖచ్చితంగా మనస్సు లో ఆందోళన కలుగుతుంది.
దీనివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. మానసిక ఒత్తిడికి గురవ్వడంవల్ల శారీరక సమస్యలు సైతం పెరిగి పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అందుకే ఆసమయంలో మనసును నియంత్రించుకోగలిగితే విజయం మనదే..
ఒత్తిడికి గురికాకుండా ఉంటే.. సంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చు. నూతన సంవత్సరంలో మీ లక్ష్యాలను ఏర్పరచుకోవచ్చు. వాటిని ఎలా సాధించాలి..? అనేదానికి ప్రధానమైంది మానసిక ఆరోగ్యం.
మానసికంగా ప్రశాంతంగా ఉంటే ప్రపంచాన్నే జయించవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచు కోవాలి..? ఏం చేస్తే మనస్సును నియంత్రించవచ్చు అనేవి తెలుసుకుందాం...
మానసిక సమస్యను పరిష్కరించడానికి, దానిని గుర్తించడం చాలా ముఖ్యం. అందుకే మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి.
మీరు మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాలంటే మీరు ఆత్రుతగా ఉన్నప్పుడు మీ ఆలోచనలను ఎలా అదుపు చేసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ప్రతికూలతను ఎదుర్కోవడంలో మీకు సహాయపడే విభిన్న విధానాలను ప్రయత్నించాలని సైకాలజిస్ట్ డాక్టర్ హిప్నోపద్మా కమలాకర్ చెబుతున్నారు.
భవిష్యత్ లో ఎప్పుడో జరగాల్సిన పనులన్నింటి గురించి అనవసరంగా ఆలోచించడం వదిలేయాలి. అలా చేస్తే మనస్సు నిజంగా రిలాక్స్ అవుతుందని ఆమె అంటున్నారు. అందుకోసమే మనస్సును ప్రశాంతంగా ఉంచే కార్యకలాపాలపైనే దృష్టి సారించాలి.
మీరు ఒత్తిడితో ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులతోగానీ ,మీకు దగ్గరగా ఉండే స్నేహితులతో మాట్లాడండి. వారితో మీ సమస్యలను పంచుకోవ డానికి ప్రయత్నించండి.
ఫోన్లు, ఇతర గాడ్జెట్ల వినియోగం తగ్గించాలి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడం పూర్తిగా మానేయాలి.
లేదంటే మనస్సు పదిరకాలుగా పరిగెత్తడం మొదలు పెడుతుంది. కాబట్టి స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది.
శారీరక శ్రమఅవసరం..ఇది మీ శరీరం సెరోటోనిన్ స్థాయిలను లేదా "హ్యాపీ హార్మోన్లను" పెంచడంలో సహాయపడుతుంది. అందువల్ల, శ్రమ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడమేకాకుండా, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కీలకంగా పనిచేస్తుంది.
అందుకే రోజుకు కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయాలి. ధ్యానం, సంగీతం వినడం, డ్యాన్స్ చేయడం లేదా వాకింగ్ వంటివి కూడా ప్రయత్నించవచ్చు
లోపాలను అంగీకరించండి: మీరు మీ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే వాస్తవికంగా ఉండటం, మీ పరిస్థితిని అంగీకరించడం చాలా ముఖ్యం." అది ఎలా అంటే..? మీ తప్పులు, వైఫల్యాలను అంగీకరించాలి. అప్పుడే మీ జీవితంలో విజయానికి మార్గం సుగమం అవుతుంది.
0 Comments:
Post a Comment