Memos - కింతలి, ఒమ్మలి హైస్కూళ్లలో 29 మంది టీచర్లకు మెమోలు
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ డిప్యూటీ డీఈవో చర్యలు..
మాడుగుల, జనవరి 27: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 29 మంది ఉపాధ్యాయులకు జిల్లా ఉప విద్యా శాఖాధికారి మెమోలు ఇచ్చారు.
వీరిలో 16 మంది కింతలి, 13 మంది ఒమ్మలి జడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు వున్నారు. డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్ శుక్రవారం మాడుగుల మండలంలోని కింతలి, ఒమ్మలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించిన అనంతరం పలు అంశాలపై ఆరా తీశారు. విద్యార్థుల పరీక్షల పేపర్లను సక్రమంగా దిద్దలేదని, విద్యార్థుల నోట్స్‌లో తప్పులను సరిచేయకుండా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కింతలి పాఠశాల హెచ్‌ఎంతో సహా 16 మంది, ఒమ్మలి పాఠశాలలో 13 మంది ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చారు. ఆయన వెంట ఎంఈవో బి.దేముడమ్మ వున్నారు.
0 Comments:
Post a Comment