Medicines: మనం ఆరోగ్య పరిరక్షణ కోసం మందులు వాడుతుంటాం. డాక్టర్ సలహాలు, సూచనల మేరకు ఔషధాలు వినియోగిస్తుంటాం. కానీ మందుల వాడకంలో జాగ్రత్తలు పాటించాలి.
మన ఇష్టానుసారం టాబ్లెట్లు వేసుకుంటే మంచిది కాదు. సొంతంగా మందుల దుకాణంలో మాత్రలు తీసుకోవడం సమంజసం కాదు. రోగం లక్షణాలతో మందులు తీసుకుంటే ఒకదానికి బదులు మరొకటి ఇస్తే సైడ్ ఎఫెక్స్ట్స్ వస్తాయి.
దీంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. ఔషధాలు వేసుకోవడంలో జాగరూకతగా ఉండాలి. ఎంత మోతాదులో వేసుకుంటున్నామో తెలుసుకుని వాడుకోవాలి.
లేదంటే మొదటికే మోసం వస్తుంది. మందులు వేసుకునేటప్పుడు ఆహార పదార్థాలు, పానీయాలు కాకుండా నీళ్లు తాగి వేసుకోవాలి.
Medicines
మందులు మన ఒంటికి పడనప్పుడు చర్మంపై దద్దుర్లు వస్తాయి. కొంత మందికి కళ్లు తిరుగుతుంటాయి. కింద పడిపోతుంటారు.
ఇంకొందరికి దీర్ఘకాలిక మందులతో జుట్టు రాలిపోవడం, దురద రావడం అధికమవుతుంది. వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవుతుంటాయి.
ఎంతగా అంటే ప్రాణాలు పోయేలా చేస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. వైద్యుడు సూచించిన సలహాల మేరకు ఔషధాలను వినియోగించుకోవాలి. కానీ సొంత వైద్యం వద్దు. జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఇంకా కొన్ని రకాల మందులతో మగతగా అనిపిస్తుంది. నోరు ఎండిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. తలనొప్పి, కడపునొప్పి బాధిస్తుంటాయి. యాంటీ బయోటెక్ మందులతో ఆకలి మందగిస్తుంది. నిద్ర మత్తు అనిపిస్తుంది. తూలిపడుతుంటారు.
ఇలా మందుల వాడకంతో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. చిన్నపాటి అనారోగ్యమైనా వైద్యులను సంప్రదించి సరైన మందులు తీసుకోవాలి. ప్రత్యామ్నాయ మందులు వాడితే అనారోగ్యం దరిచేరడం ఖాయం. కాబట్టి ఔషధాల వినియోగంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందే.
Medicines
ఇష్టమొచ్చినట్లు ఔషధాలు వాడకం అంత మంచిది కాదు. వైద్యుడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తోనే మందులు తీసుకోవాలి. అంతేకాని సొంత తెలివితేటలతో మందులు కొనకూడదు. అలా చేస్తే ఇబ్బందులు రావడం గ్యారంటీ.
ఔషధాల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఎన్నో ఇతర రోగాలకు కారణమవుతాం. ఇంకా ఔషధాల వాడకంతో ఇతర రోగాలు కూడా పుట్టుకొస్తాయి.
దీంతో ఎన్నో సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. దీంతో మనం వేసుకునే మాత్రల విషయంలో తగు విధంగా చర్యలు తీసుకుంటేనే ప్రయోజనం.
0 Comments:
Post a Comment