Living Nostradamus : బ్రెజిల్‌కి చెందిన 35 ఏళ్ల అతోస్ సాలోమ్ (Athos Salome) భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెబుతున్నాడు.
అతను చెప్పిన వాటిలో చాలావరకూ ఇప్పటికే జరిగాయి. కరోనా వైరస్, బ్రిటన్ రాణి మరణం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ సొంతం చేసుకోవడం ఇవన్నీ అతోస్ ముందే చెప్పాడు. అందువల్ల అతను 2023కి సంబంధించి ఏం చెప్పాడన్నది ఆసక్తిగా మారింది. (ప్రతీకాత్మక చిత్రాలు)
500 ఏళ్ల కిందట ఫ్రాన్స్‌కి చెందిన నోస్ట్రడామస్.. ఇలాగే భవిష్యత్తులో జరగబోయే విషయాల్ని ముందే చెప్పాడు. వాటిలో చాలావరకూ జరిగాయి. అతోస్ చెప్పినవి కూడా అలాగే జరుగుతుండటంతో.. అతన్ని ఆధునిక నోస్ట్రడామస్ అంటున్నారు. 2023కి సంబంధించి అతను అసాధారణ విషయాల్ని చెప్పాడు. (image credit - instagram - athos_salome)
2023లో యేసుక్రీస్తును వ్యతిరేకిస్తూ (Antichrist) ఓ ఉద్యమం లాంటిది మొదలవుతుందన్న అతోస్.. దీని కారణంగా.. యుగాంతానికి ఈ సంవత్సరమే ఆరంభంగా ఉంటుందని తెలిపాడు. క్రైస్తవ పురాణాల్లో యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఒకరు (Enemy of the Messiah) యూరప్ నుంచి వస్తారనీ.. అలా రావడమే యుగాంతం అనే ప్రచారం ఉంది. అది ఇప్పుడే అని అతోస్ చెబుతున్నాడు. కాకపోతే.. ఒకరే రారు అనీ, చాలా మంది ఉంటారనీ... అంటున్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)
క్రిప్టోకరెన్సీ (cryptocurrency) అడ్డంగా లాస్ అవుతుందని అతోస్ తెలిపాడు. డాలర్‌ను దెబ్బతీయడం తేలిక కాదన్న అతోస్.. బలమైన ప్రక్షాళన జరుగుతుందనీ.. ఫలితంగా క్రిప్టోకరెన్సీ విలువ భారీగా పడిపోయి.. వేల మంది పెట్టుబడిదారులు నష్టపోతారని తెలిపాడు. (ప్రతీకాత్మక చిత్రం)
2022 జనవరి 11న హ్యూమన్ క్లోనింగ్ అంశం.. ప్రపంచాన్ని భయపెడుతుందని అతోస్ చెప్పాడు. ఈ అంచనా కూడా నిజమైంది. ఈమధ్యే యెమెన్ సైంటిస్ట్ హాన్షెమ్ అల్ ఘైలీ కి చెందిన సంస్థ ఎక్టోలైఫ్.. ప్రపంచంలోనే తొలి కృత్రిమ గర్భ సౌకర్యాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ఏడాదికి 30000 బిడ్డలను కృత్రిమంగా పెంచగలం అని తెలిపింది. ఈ వార్త ప్రపంచాన్ని భయపెట్టింది. 2023లో ఇది మరింతగా భయపెడుతుందని తెలిపాడు. (ప్రతీకాత్మక చిత్రం)
2023లో అంటార్కిటికా నుంచి జాంబీ వైరస్ వస్తుందని అతోస్ తెలిపాడు. దీని వల్ల ఎలాంటి సమస్య వస్తుందో చెప్పలేదు గానీ.. యుగాంతానికి మాత్రం 2023 ఆరంభ సంవత్సరంగా ఉంటుందని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. వచ్చే 20 ఏళ్ల భవిష్యత్తును తాను చూడగలుగుతున్నానని అతోస్ అంటున్నాడు. అతని అంచనాలను కొందరు సమర్థిస్తుంటే.. కొందరు వ్యతిరేకిస్తున్నారు. నమ్మేవాళ్లు నమ్ముతున్నారు. నమ్మనివాళ్లు నమ్మేది లేదంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
0 Comments:
Post a Comment