LIC Policy: రోజూ రూ.40 పొదుపు... రూ.25 లక్షల రిటర్న్స్... ఈ ఎల్ఐసీ పాలసీతో సాధ్యం..
1. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అందిస్తున్న పాలసీల్లో కొన్ని ఇన్స్యూరెన్స్ పాలసీలు పాపులర్ అయ్యాయి.
కొన్ని పాలసీల్లో మెచ్యూరిటీ గడువు పూర్తైన తర్వాత కూడా జీవితాంతం కవరేజీ లభిస్తుంది. అలాంటి పాలసీల్లో ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ (LIC Jeevan Anand) పాలసీ కూడా ఒకటి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఎల్ఐసీ అందిస్తున్న పాలసీల్లో ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ చాలా పాపులర్. మెచ్యూరిటీ సమయంలో పూర్తి డబ్బులు రావడంతో పాటు, జీవితాంతం కవరేజీ పొందొచ్చు. మరి న్యూ జీవన్ ఆనంద్ పాలసీ ప్రయోజనాలు ఎలా ఉంటాయి? ఎవరు తీసుకోవచ్చు? ఎంత ప్రీమియం చెల్లించాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్‌ను కనీసం రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. సమ్ అష్యూర్డ్ పైన 125 శాతం కవరేజీ లభిస్తుంది. ఉదాహరణకు రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకుంటే రూ.1,25,000 కవరేజీ లభిస్తుంది. పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీహోల్డర్ మరణిస్తే నామినీకి ఈ డబ్బులు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 18 ఏళ్లు. గరిష్ట వయోపరిమితి 50 ఏళ్లు. పాలసీ టర్మ్ 15 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉంటుంది. 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 35 ఏళ్ల టర్మ్‌తో రూ.1 లక్ష సమ్ అష్యూర్డ్‌తో ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకుంటే రూ.2,935 + ట్యాక్సెస్ ప్రీమియం చెల్లించాలి. అంటే రోజుకు రూ.10 కన్నా తక్కువే. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ బ్రోచర్‌లో బెనిఫిట్స్‌కు సంబంధించి ఓ ఉదాహరణ ఇచ్చింది. 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 35 ఏళ్ల పాలసీ టర్మ్‌తో రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ తీసుకుంటే రూ.3,165 + ట్యాక్సెస్ ప్రీమియం చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. బెనిఫిట్స్ విషయానికి వస్తే మెచ్యూరిటీ ప్రయోజనాలు రూ.2,56,000 వరకు వస్తాయి. బోనస్‌తో కలిపి రూ.2,81,000 వరకు బెనిఫిట్ లభిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత కూడా పాలసీహోల్డర్‌కు రూ.1,00,000 కవరేజీ ఉంటుంది. 100 ఏళ్ల లోపు ఎప్పుడు మరణించినా నామినీకి రూ.1,00,000 డెత్ బెనిఫిట్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక మరో ఉదాహరణ చూద్దాం. 18 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 35 ఏళ్ల టర్మ్‌తో రూ.5,00,000 సమ్ అష్యూర్డ్‌తో న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ తీసుకుంటే నెలకు రూ.1156 ప్రీమియం చెల్లించాలి. కనీసం రూ.6,25,000 రిస్క్ కవర్ లభిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత సమ్ అష్యూర్డ్, బోనస్ కలిపి రూ.25 లక్షల పైనే బెనిఫిట్ లభిస్తుంది. ఆ తర్వాత పాలసీహోల్డర్‌కు రిస్క్ కవర్ రూ.5,00,000 కొనసాగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
0 Comments:
Post a Comment