ప్రతి ఇంట్లో అన్నం మిగిలిపోవడం, కూరలు మిగిలిపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటి రోజు ఉదయమో, రాత్రో తింటూ ఉంటారు చాలా మంది.
ఫ్రిజ్లో దాచుకొని రెండు మూడు రోజుల తర్వాత తినే వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని రకాల ఆహారాలు ఇలా దాచుకొని తినడం వల్ల ఎలాంటి ముప్పు ఉండదు, కానీ కొన్ని రకాలు మాత్రం తినడం వల్ల అవి శరీరానికి హాని చేసే అవకాశం ఉంది.
అధ్యయనాల ప్రకారం కొన్ని ఆహారాలు లేదా పదార్థాలు తిరిగి వేడి చేసుకుని తిన్నప్పుడు అవి హానికర సమ్మేళనాలను విడుదల చేస్తాయి.
ఆ సమ్మేళనాలు ఆరోగ్యానికి చాలా ముప్పుగా మారుతాయి. ముఖ్యంగా మేము ఇక్కడ ఇచ్చిన ఐదు ఆహారాలు మిగిలిపోతే పడేయండి, కానీ తినకండి.
గుడ్లు
గుడ్లు కూర మిగిలిపోతే మరుసటి రోజు తిందామని దాచుకోవద్దు. ఉడికించిన గుడ్లు ఏరోజుకారోజు తినడమే మంచిది. వీటిలో ఎల్లప్పుడూ సాల్మొనెల్లా అనే బాక్టీరియా ఉంటుంది. మిగిలిపోయిన గుడ్లు ఫ్రిడ్జ్ లో దాచినప్పుడు ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా బతికే ఉంటుంది. మరుసటి రోజు ఆ గుడ్లను కాస్త వేడి చేసుకొని తిన్నా కూడా ఆ బాక్టీరియా చావదు. ఆ బాక్టీరియా శరీరంలో చేరడం వల్ల అంతర్గతంగా హాని కలుగుతుంది.
బీట్రూట్
బీట్రూట్ కూర, పచ్చడి ఏ రోజుకి ఆరోజే తినాలి. వీటిలో నైట్రిక్ ఆక్సైడ్ సమృద్ధిగా ఉంటుంది. ఈ బీట్రూట్ కూర లేదా పచ్చడిని మరుసటి రోజు తినే ముందు వేడి చేయడం వల్ల అందులో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ ,నైట్రేట్లుగా, ఆ తరువాత నైట్రోసమైన్లుగా మారుతుంది .
నైట్రోసమైన్లు క్యాన్సర్ కారకాలని ఎప్పుడో గుర్తించారు శాస్త్రవేత్తలు. కాబట్టి బీట్రూట్ కూర మిగిలితే పడేయండి, కానీ మరుసటి రోజు వేడి చేసుకుని తినకండి.
పాలకూర
పాలకూరలో కూడా బీట్రూట్లో ఉన్నట్టే నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరను మళ్ళీ వేడి చేసినప్పుడు క్యాన్సర్ కారక నైట్రోసమైన్లు విడుదలవుతాయి. ఇది శరీరంలో చేరితే చాలా హానికరంగా మారుతుంది.
పచ్చి చికెన్
చికెన్ తెచ్చినప్పుడు కొంత ఫ్రిడ్జ్ లో దాచి, కొంత వండుతారు. ఆ పచ్చి చికెన్ పై సాల్మొనెల్ల అనే బాక్టీరియా నిత్యం ఉంటుంది. దాన్ని మళ్ళీ వేడి చేసినప్పుడు బాగా ఉడికించకపోతే ఆ సాల్మొనెల్లా శరీరంలో చేరి ముప్పుగా మారుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఎప్పటికప్పుడు చికెన్ తెచ్చి వండుకోవడం మంచిది.
కోల్డ్ ప్రెస్డ్ నూనెలు
అవిసె గింజల నూనె, ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్స్ వంటివి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. వీటిలో ఒమేగా 3 కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ నూనెలను పదేపదే వేడి చేయడం వల్ల అవి ఆరోగ్యానికి సురక్షితం కావు.
0 Comments:
Post a Comment