India vs China: గాల్వాన్ లోయలో చావు దెబ్బ తిన్నా, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో గాయాల పాలైనా చైనాకు బుద్ధి రావడం లేదు..ఓ పక్క కోవిడ్ వల్ల దేశం వల్లకాడవుతున్నా కొంచెం కూడా ఇంగితం కలగడం లేదు..
పైగా రోజురోజుకు నెత్తి మాసిన పనులు చేసుకుంటూ పరువు తీసుకుంటున్నది. భారత్ అంటేనే మండి పడే, పొరుగు దేశాలతో మంట పెట్టే డ్రాగన్… ఈసారి ఏకంగా జల ఖడ్గం దూసింది.
అరుణాచల్ ప్రదేశ్ లో డ్యాముల నిర్మాణ వేగం పెంచింది.. ఈశాన్యంలో సరిహద్దు వెంబడి భారీగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది.
అంతేకాదు సరిహద్దుల వెంట ఏకంగా గ్రామాలు నిర్మిస్తోంది.. పైగా ఉల్లంఘనలకు పాల్పడుతూ ఆ దేశ సైనికులను భారత జవాన్ల మీదికి ఉసిగొల్పుతోంది.. దీనివల్లే గాల్వాన్ లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
India vs China
అత్యంత కీలకం
అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మిజోరాం రాష్ట్రాలు భారత్ కు అత్యంత కీలకం. దేశంలో కురిసే వర్షపాతం లో 30% ఇక్కడే నమోదు అవుతూ ఉంటుంది.. పైగా సుగంధ ద్రవ్యాలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు.. దేశంలో ఉన్న అడవుల విస్తీర్ణంతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎక్కువ.. పైగా ఇక్కడ కురిసిన వర్షాలు చాలా రాష్ట్రాలకు ఆసరాగా నిలుస్తున్నాయి.
ఇవన్నీ తెలుసుకున్న చైనా ఎప్పటినుంచో భారత్ ఆను పానుల మీద దెబ్బ కొట్టాలని చూస్తోంది. అంతేకాదు మొన్న ఒక రకమైన పుట్టగొడుగుల కోసం ఈ ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అక్రమంగా చొరబట్లకు పాల్పడింది.. అలాంటి దూర్త దేశం చైనా.
మరోవైపు భారత్ లోని పలు రాష్ట్రాలను ఎడారులుగా మార్చాలని కంకణం కట్టుకొని, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తోంది.. అంతేకాదు నదులకే అడ్డుకట్టలు కడుతూ వాటి స్వరూపాన్ని మార్చేస్తోంది.
బ్రహ్మపుత్ర నదిపై ఇష్టానుసారంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. గతంలో చైనా ఏం చేసినా చెల్లుబాటు అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
అప్పర్ సుబన్ ప్రాంతంలో..
భారత్ పైకి జలఖడ్గం తీసుకొస్తున్న చైనాకు బుద్ధి చెప్పే విధంగా… అప్పర్ సుబన్ సిరి ప్రాంతంలో 11 వేల మెగావాట్ల సామర్థ్యంతో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి భారత్ యుద్ధ ప్రాతిపదికన శ్రీకారం చుట్టింది.. స్తంభించిన మరో మూడు ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా వేగిరం చేసింది.. లోయర్ సుబన్ సిరి ప్రాంతంలోని 2000 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం ఈ ఏడాది మధ్యలోనే పూర్తయ్యే అవకాశం ఉంది.. ఇక అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని మెడాగ్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిపై 60 వేల మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో… భారత్ మరింత అప్రమత్తమైంది.
ఒకవేళ ఇది నిర్మాణం పూర్తి అయితే భారత్ పలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. చైనా ఆ నీటిని మళ్లించేస్తే భారత్లో కరువు కాటకాలు ఏర్పడతాయి.
India vs China
ఒకవేళ ఆ నీటిని చైనా కిందకి విడుదల చేస్తే అరుణాచల్ ప్రదేశ్, రాష్ట్రాల్లో భారీగా వరదలు సంభవించి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.. వీటితోపాటు పర్యావరణ సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.
.మన దేశానికి అవసరమైన జల వనరుల్లో సుమారు 30% అందించే సామర్థ్యం బ్రహ్మపుత్ర నదికి ఉంది.. ఈ నది పరివాహక ప్రాంతంలో దాదాపు 50 శాతం భూ భాగం చైనాలో ఉంది.. చైనాలో గనుక వరదలు సంభవించి పెద్ద మొత్తంలో నీరు విడుదలయితే మనదేశంలో ఏడాది వరకు నీటి కొరతే ఉండదు.. అయితే ప్రస్తుతం చైనా దేశంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా భారత్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో డ్రాగన్ కు ఏం చేయాలో పాలు పోవడం లేదు.
0 Comments:
Post a Comment