చలికాలం వచ్చిందంటే, చాలా మందికి సోమరితనం పెరుగుతుంది, తరచుగా ఆకలిగా అనిపిస్తుంది. ఈ సీజన్ లో కొన్నిసార్లు ఎన్ని పొరల దుస్తులు ధరించినా చలి ఆగదు, ఏ పని చేయాలనిపించదు.
చల్లటి గాలుల కారణంగా దగ్గు, జలుబు వంటి సీజనల్ ఫ్లూలతో పాటు గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు వంటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి.
అంతేనా, చల్లని గాలి మన ధమనులను బిగుతుగా చేస్తుంది, ఇది గుండెకు రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది, రక్తపోటును పెంచుతుంది. పైగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది.
కాబట్టి ఈ చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే మితమైన వ్యాయామంతో పాటు, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం.
Tips To Improve Blood Circulation In Winter- చలికాలంలో సరైన రక్త ప్రసరణకు చిట్కాలు
మీ శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగటానికి, మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఈ శీతాకాలంలో మీ ఆహారంలో చేర్చుకోవాల్సినవి, మీరు తీసుకోవాల్సిన జాగ్రతలను ఇక్కడ తెలుసుకోండి.
ఆరోగ్యకరమైన ఆహారం
ఈ చలికాలంలో విటమిన్లు, పోషకాలతో నిండిన గింజలు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి ఎక్కువగా తినండి. దానిమ్మ పండ్లు, దాల్చిన చెక్క, వెల్లుల్లి, కొవ్వుచేప మొదలైనవి మీ ఆహారంలో చేర్చుకోండి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి చలికాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఉప్పు, చక్కెరలు అధికంగా ఉండే ఆహారాలను, అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలను వదిలివేయండి.
కొంచెం వ్యాయామం
చలికి భయపడి దుప్పట్లో దూరి వెచ్చగా ముడుచుకోవడం హాయిగా ఉంటుంది, కానీ శరీరాన్ని కదలించడం కూడా చాలా ముఖ్యం. శారీరక శ్రమ మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, రోజూవారీ వ్యాయామం మీ రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. నడక, జాగింగ్, స్విమ్మింగ్ వంటి కార్డియో వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి.
మద్యపానం- ధూమపానం హానికరం
మద్యపానం, ధూమపానం ఏ కాలంలోనైనా హానికరం, ఈ చలికాలంలో మరింత హానికరం. ఎందుకంటే చలికి వెచ్చదనం కోసం విస్కీ, రమ్, జిన్ అంటూ అతిగా మద్యం సేవిస్తారు, ఎక్కువ సిగరెట్లు వెలిగిస్తారు. కానీ ఈ అలవాట్లు మీ రక్తాన్ని ప్రసరించే మీ శరీర సామర్థ్యాన్ని నెమ్మదిస్తుంది. మీ రక్త ప్రసరణ తగ్గుతుంది. రక్తనాళాలు ఇరుకుగా మారి అధిక రక్తపోటుకు దారితీయవచ్చు.
మసాజ్ - స్ట్రెచింగ్స్
చలికాలంలో శరీరానికి డీప్ మసాజ్‌లు చాలా మేలు చేస్తాయి. ఇవి రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తాయి, వాస్కులర్ పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే స్ట్రెచింగ్స్ చేయడం, మీ కాళ్ళ చేతులను చాచడం, పైకి లేపడం వంటివి నేరుగా ప్రసరణను మెరుగుపరచడానికి, సిరలపై ఒత్తిడిని తగ్గించడానికి ఒక మంచి మార్గం.
డ్రై బ్రషింగ్
చర్మంపై డ్రై బ్రషింగ్ చేసే విధానం ప్రయత్నించండి. రోజువారీ పొడి బ్రషింగ్ మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడమే కాకుండా, మీ రక్త ప్రసరణను పెంచుతుంది, ఇది మీ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది.
0 Comments:
Post a Comment