బ్యాడ్మింటన్ లో రాణిస్తోన్న బామ్మలు.
బామ్మలు బ్యాట్మింటన్ లో రాణించడం ఏంటా అని ఆశ్చర్య పోతున్నారా. మీరు చదివింది నిజమే. సహజంగా 70 సంవత్సరాల తరవాత కృష్ణా, రామా అంటూ మనవళ్లు, మనవరాళ్లతో కాలం వెళ్లదీస్తూ ఉంటారు.
కానీ హైదరాబాద్ లోని వాయుసేన కాలనీకి చెందిన ఇద్దరు బామ్మలు బ్యాడ్మింటన్ లో దుమ్మురేపుతున్నారు. తాజాగా రాజస్థాన్ ఉదయపూర్ లో జరిగిన టోర్నమెంట్ లో ఏకంగా రజతం సాధించి సత్తా చాటుకున్నారు.
సికింద్రాబాద్ వాయుపురి కాలనీకి చెందిన 71 ఏళ్ల శ్యామోలా ఖన్నా. 72 సంవత్సరాల నందినీ నాగరాజన్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అంతేకాదు. వీరిద్దరూ వారి కాలనీలోని పార్కులో ప్రతి రోజూ బ్యాడ్మింటన్ ప్రాక్టీసు చేస్తూ జాతీయ పోటీలకు సిద్దం అయ్యారు.
ఇలా 2023 జనవరి 17 నుంచి 24 వరకు రాజస్ధాన్ లోని ఉదయ్ పూర్ నగరంలో జరిగిన సన్‌రైజ్ ఆల్ ఇండియా మాస్టర్స్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో రజతం సాధించి సత్తా చాటుకున్నారు.
ఈ ఇద్దరు బామ్మలు యుక్త వయసులో కాలేజీకి వెళ్లినప్పటి నుంచే బ్యాడ్మింటన్ ఆడడం మొదలుపెట్టారు. నా సహచరుడు, నేను ఇద్దరం గతంలో ఇంటర్-కాలేజియేట్ టోర్నమెంట్‌లలో ఆడినట్టు శ్యామోలా తెలిపారు. మా కాలనీలో బ్యాడ్మింటన్ కోర్టు కట్టించడంతో ఇద్దరం ఆడుకోవడం మొదలుపెట్టినట్టు నందినీ నాగరాజన్ తెలిపారు.
మా కాలనీలో శ్రీ ప్రకాష్ అనే పెద్దాయన ప్రపంచ మాస్టర్స్‌లో ఆడి గెలుపొందారు. అది మాకు స్ఫూర్తినిచ్చిందని వారు చెబుతున్నారు. టోర్నమెంట్లో పాల్గొనేందుకు వీరు 2 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నట్టు గుర్తు చేశారు.
వివిధ వర్గాల ప్రజలు, వారి అభిరుచులను నెరవేర్చుకునేందుకు క్రీడలు ఉపయోగపడతాయి. పార్కులో ఆడటం మొదట కొంచెం ఇబ్బంది అనిపించిన తరవాత అలవాటైందని శ్యామోలా తెలిపారు. సరదాగా పార్కులో బ్యాడ్మింటన్ ఆడటానికి తాము సిగ్గుపడాల్సిన పని లేదని ఆమె అన్నారు.
మొదట్లో కొందరు వింతగా చూసినా, తరువాత అలవాటు పడినట్టు చెప్పారు. మోకాళ్ల పైకి ప్యాంటు వేసుకోవాల్సి రావడంతో మొదట్లో కొంత ఇబ్బంది పడ్డారు.
తరవాత పూర్తి ట్రాక్ ప్యాంటు వేసుకున్నారు. రిఫరీ సలహా మేరకు ట్రాక్ ఫ్యాటు స్థానంలో మోకాళ్లపైకి లాగులు వేసుకోవాల్సి వచ్చిందని శ్యామోలా గుర్తు చేశారు.
డబుల్స్ లో రజతం సాధించిన ఇద్దరు బామ్మలూ 70 ఏళ్ల పైబడిన వారే. శ్యామోలా ఖన్నా సింగిల్స్ సెమీ-ఫైనల్‌కు చేరుకుని కాంస్యం గెలుచుకోగా, 70 ఏళ్లు పైబడిన విభాగంలో వీరిద్దరూ ఫైనల్స్‌కు చేరుకుని రజతం గెలుచుకున్నారు.
అన్ని వయసుల వారు బ్యాడ్మింటన్ గేమ్ ఆడవచ్చని వారు సూచిస్తున్నారు. ఇది శారీరక శ్రమను కోరుకునే అద్భుతమైన గేమ్. ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుంది శ్యామోల్ తెలిపారు.
0 Comments:
Post a Comment