🔻పోలీస్ స్టేషన్లో హెచ్ఎం నిర్బంధం
పోలీస్ స్టేషన్లో ఓ ప్రధానోపాధ్యాయుడ్ని నిర్భంధించిన ఘటన సోమవారం సూళ్లూరుపేటలో చోటుచేసుకొంది.
సూళ్లూరుపేట, జనవరి 9: పోలీస్ స్టేషన్లో ఓ ప్రధానోపాధ్యాయుడ్ని నిర్భంధించిన ఘటన సోమవారం సూళ్లూరుపేటలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని కోటపోలూరు జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ప్రధాపాధ్యాయుడిగా ఎం.ప్రసాద్ రెడ్డి పనిచేస్తున్నారు. మధ్యాహ్నం పాఠశాలకు పోలీసులు వెళ్లి ఎస్ఐ స్టేషన్కు తీసుకురమ్మన్నారంటూ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించినా సమాధానం లేదు. నిన్ను అరెస్ట్ చేస్తాం.... నీ మీద ఫిర్యాదు వచ్చిందంటూ రాత్రి 9గంటల వరకు స్టేషన్లోనే కూర్చోబెట్టారు. ఇటీవల పాఠశాలలో నిర్మించిన సచివాలయం వివాదాస్పదం కావడంతో ఆ భవనాన్ని పాఠశాలకు కేటాయించారు. ఇది రుచించని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రధానోపాధ్యాయుడిని ఇలా బెదిరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుడ్ని స్టేషన్కు తీసుకురావాలంటే ఖచ్చితంగా ముందస్తు నోటీసు జారీ చేసి సంబంధిత విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఆలాంటిదేమీ లేకుండా విచారణ పేరుతో రాత్రి 10గంటల వరకు ఉంచడం ఏమిటని యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.ఈ విషయమై ఎస్ఐ రవిబాబును అడగ్గా గ్రామంలో వేరేవారితో ఆయన గొడవపడడంతో విచారణ నిమిత్తం తీసుకొచ్చామని చెప్పారు. అరెస్ట్ చేయలేదని, కేసు కూడా నమోదు చేయలేదన్నారు.అప్పుడే పంపించేశామని చెప్పడం గమనార్హం.ఎంఈవో ఆంజనేయులు శెట్టి ఈ విషయమై మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన విషయంపై ఎవరూ సమాచారం ఇవ్వలేదన్నారు.
0 Comments:
Post a Comment