తెలంగాణవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ప్రత్యేకంగా హైకోర్టులో ఖాళీగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది.
ఏదేని డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్ధులు ఈ 20 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా నియామక ప్రక్రియ ఉండనుంది.
ఆన్ లైన్లో ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి. మార్చిలో పరీక్ష నిర్వహిస్తారు. టైపింగులో హయ్యర్ గ్రేడ్, పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లేదా, కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా బీసీఏ ఉండాలి.
వయసు ఈ నెల 11 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులకు నిబంధనల ప్రకారం వయసు సడలింపు వర్తిస్తుంది.
ఎంపికైన అభ్యర్ధులకు ప్రారంభ జీతం రూ. 38 వేల 890 చెల్లిస్తారు. సీనియారిటీ పెరిగే కొద్దీ రూ. 1 లక్షా 12 వేల 510 వరకు జీతం పెరుగుతుంది. మరిన్ని వివరాలకు http://tshc.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
0 Comments:
Post a Comment