Healthy Life : మనిషి జీవించడానికి ఆహారం అవసరం. ఆహారం లేకుండా ఎక్కువ కాలం జీవించడం సాధ్యం కాదు.
తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఏది దొరికితే అది తిని, ఆకలి తీర్చుకోవాల్సిన దుస్థితి ఒకవైపు ఉంటే అధునిక పోకడలతో అనవసరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యపరమైన ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటున్న పరిస్ధితి మరోవైపు కనిపిస్తుంది.
ఈ నేపధ్యంలో ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఆహారం తీసుకునే విషయంలో కొన్ని నియమాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
మనం తీసుకునే ఆహారం తేలికగా జీర్ణమయ్యేదిగా ఉండాలి. ప్రకృతి సహజంగా పండించిన ఆహారాన్నే తీసుకోవటం ఆరోగ్యానికి శ్రేయస్కరం. కాయగూరలు , ఆకుకూరలు , పండ్లను మంచి నీటిలో కడిగిన తరవాతనే తినాలి.
వీలయితే ఉప్పు వేసి కడిగితే దాని మీద ఉన్న కొన్ని ఫంగస్ , బ్యాక్టీరియా , పురుగు మందుల అవశేషాలు కొంత మేర తొలగిపోతాయి. ఋతువుల ప్రకారం ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.
ఎక్కువ కాలం నిలువ ఉంచిన ఆహారాన్ని తినరాదు, ప్రతి పదార్థానికి జీవిత కాలం అనేది ఉంటుంది. చెడు వాసన వచ్చే ఆహారాన్ని తినకుండా ఉండాలి.
ఎక్కువగా పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తినాలి ,బీర , తృణ ధాన్యాలు , మొలకెత్తిన విత్తనాలు , పండ్లు , ఆకు కూరలు , చిలగడదుంప వంటి వాటిని తీసుకోవాలి.
మధుమేహం ఉన్నవాళ్లు పంచదార కలిగిన పదార్థాలను తినకపోవడం మేలు. గుండె సమస్యలు ఉన్నవాళ్లు బాదాం లాంటి పదార్థాలు తీసుకోవాలి.
ఆహారం తినే టప్పుడు తగినంత సమయం తీసుకుని తినాలి , నెమ్మదిగా తినాలి, ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆహారం తినే టప్పుడు మాట్లాడరాదు ,మాట్లాడినా కూడా అతి తక్కువగా మాట్లాడాలి.
తినే స్థలము పరిశుభ్రంగా ఉండాలి , స్థిరాసనం లో ఉండి తినాలి. ఆహారం తినే టప్పుడు అవసరం మేరకు నీటిని తీసుకోవాలి. ఆహారం తిన్న 30 నిమిషాల తరవాత తగినంత నీటిని త్రాగితే తేలికగా జీర్ణం అవుతుంది.
ఆహారం తగినంత పోషకాలు కలిగినదయి ఉండాలి . ఎప్పుడు ఒకే రకమయిన పదార్థాలు తీసుకోరాదు. మన శరీరంలోకి వెళ్లిన ఆహారం 24 గంటల్లో మలంగా బయటికి వెళ్లిపోవాలి, అలాంటి ఆహార పదార్ధాలే తినాలి లేకపోతే జబ్బులు చేస్తాయి. ప్రతి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని 3 లేదా 4 గ్లాసులు తీసుకోవాలి. దీనివల్ల విరేచనం సాఫీగా అయ్యి మలినాలు వెళ్లి పోతాయి.
ఆహారాన్ని తగినంతనే తినాలి అతి ఎక్కువ అతి తక్కువ రెండు అనర్థమే, రోజుకు రెండు సార్లు మాత్రమే తినాలి, ప్రొద్దున మల్లి రాత్రి ప్రారంభ కాలంలో , ప్రతి భోజనానికి మధ్య 4 నుండి 6 గం సమయం ఉండాలి.
రాత్రి 7 గం ల లోపు తినాలి. త్వరగా నిద్రపోవాలి. ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కవ కాలం జీవించేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
0 Comments:
Post a Comment