ప్రతి వ్యక్తికి ఒక బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అయితే ఈ బ్లడ్ గ్రూప్ ఆధారంగా భవిష్యత్తులో వచ్చే వ్యాధులను గుర్తించవచ్చనే సంగతి మీకు తెలుసా? నూతన పరిశోధన ప్రకారం మీ బ్లడ్ గ్రూప్ మీ భవిష్యత్ స్ట్రోక్‌ను అంచనా వేస్తుంది.
60 ఏళ్లలోపు వయసులో పక్షవాతం వస్తుందా లేదా అనే దానినితో పాటు ఈ ముప్పును ముందుగానే అంచనా వేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
నూతన పరిశోధనల ప్రకారం ఒక వ్యక్తి బ్లడ్ గ్రూప్ స్ట్రోక్ వచ్చే ప్రమాదంతో ముడిపడి ఉంటుంది. దీని సహాయంతో యువకులలో స్ట్రోక్ ముప్పును తగ్గించవచ్చు.
స్ట్రోక్‌కి సంబంధించిన బ్లడ్ గ్రూప్... బ్లడ్ గ్రూప్‌లో A మరియు B బ్లడ్ గ్రూప్, AB లేదా O ఉంటాయి. A బ్లడ్ గ్రూప్ ఉన్నవారు 60 ఏళ్లలోపు వయసులో స్ట్రోక్‌ను ఎదుర్కొంటారని పరిశోధనలు చెబుతున్నాయి.
ఈ పరిశోధన కోసం పరిశోధకులు 48 జన్యు అధ్యయనాల నుండి విరివిగా సమాచారాన్ని సేకరించారు. ఇందులో సుమారు 600,000 నాన్-స్ట్రోక్ యూనిట్లు, స్ట్రోక్‌తో బాధపడుతున్న సుమారు 17,000 మంది రోగులు ఉన్నారు. పాల్గొనే వారందరి వయస్సు 18 మరియు 59 మధ్య ఉంది.
ఇతరుల కంటే 16 శాతం ముప్పు అధికం.. పరిశోధనలో విశ్లేషణ ప్రకారం ఇతర రక్త సమూహాలతో పోలిస్తే, A బ్లడ్ గ్రూప్‌తో జన్యువులు కోడ్ చేయబడిన వ్యక్తులకు 60 ఏళ్లలోపు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 16 శాతం ఎక్కువగా ఉందని తేలింది.
రక్తం గ్రూప్ O1 జన్యువు ఉన్నవారిలో ప్రమాదం 12 శాతం తక్కువగా ఉందని వెల్లడయ్యింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, టైప్ A బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
దీని వెనుక కారణం...న్యూరాలజిస్ట్ స్టీవెన్ కిట్నర్ తెలిపిన వివరాల ప్రకారం “ఎ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుందో ఇంకా తెలియరాలేదన్నారు.
అయితే ప్రస్తుతం తాము ప్లేట్లెట్స్, రక్త నాళాలతో పాటు ఇతర విషయాలకు లింక్ చేయడం గురించి చూస్తున్నామన్నారు.
ఇవన్నీ శరీరంలో రక్తం గడ్డకట్టడంలో పాత్ర పోషిస్తాయి. అయితే దీనిపై మరింత పరిశోధన అవసరమన్నారు.
ఈ పరిశోధనల కారణంగా యువతరాన్ని రాబోయే కాలంలో స్ట్రోక్ నుండి రక్షించవచ్చని లేదా ముందుగానే తనిఖీ చేయడం ద్వారా సురక్షితమైన చర్యలు తీసుకోవచ్చని అన్నారు.
0 Comments:
Post a Comment