* కాస్తంత దళసరిగా ఉండే బచ్చలాకులో విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఉన్నందున మంచి పోషకాహారం.
* బచ్చలికూర మధుమేహాన్ని, ఉబ్బస వ్యాధిని తగ్గిస్తుంది. క్యాన్సర్‌ను నివారిస్తుంది.
* మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మం ముడతలు పడదు. అందువల్ల ముఖం నేవళంగా, నిగారింపుతో ఉండి వయసును కనపడనివ్వదు. కురులు రాలవు, కుదుళ్లు బలంగా ఉంటాయి.
* కంటిచూపును మెరుగు పరుస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తం గడ్డ కట్టదు. హృద్రోగాలను అరికడుతుంది.
* బచ్చలాకు తరచూ తినేవారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవని ఎన్నో అధ్యయనాల్లో తేలింది.
* పీచు ఎక్కువ కనుక జీర్ణ ప్రక్రియ సాఫీగా ఉంటుంది. పిండి పదార్థాలు తక్కువున్నందున ఊబకాయం రాదు.
* బచ్చలితో కూర, పచ్చడి ఏదైనా బాగుంటుంది. అరటి, మిర్చి బజ్జీల్లా బచ్చలాకు బజ్జీలు ఘుమ ఘుమలాడుతూ నోరూరిస్తాయి.
* ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనుకునేవారు బచ్చలికూరను ఏదో రూపంలో తరచూ తినాలి.
0 Comments:
Post a Comment