మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన విధానం సరిగ్గా ఉండాలి. మానవ జీవితానికి ముఖ్య జీవనాధారం అయిన నీటి విషయంలో జాగ్రత్త వహించాలి. సరైన ఆహారం తీసుకోవడంతోపాటు నిత్యం మనం తాగే నీళ్ళ పైన కూడా శ్రద్ధ పెట్టాలి.
శరీరానికి కావాల్సిన నాలుగు నుండి ఐదు లీటర్ల నీటిని ఖచ్చితంగా తీసుకోవాలి. లేకుంటే శరీరం అనారోగ్యం పాలవుతుంది. నీళ్ళే కదా అని నిర్లక్ష్యం చేస్తే దుష్పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది.
కూల్ వాటర్ ఎందుకు తాగొద్దో తెలుసా
చాలామంది నీళ్లను తాగడానికి బాగా కూల్ ఉన్న నీళ్లను తాగుతూ ఉంటారు. కొందరైతే బరువు తొందరగా తగ్గాలని విపరీతంగా వేడి చేసిన నీళ్ళను తాగుతారు.
అయితే ఈ రెండు ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు వైద్య నిపుణులు. మనం కూల్ వాటర్ ఎందుకు తాగకూడదు అనే విషయం పైన కూడా వివరణ కూడా ఇస్తున్నారు.
మన పొట్టలో ఎప్పుడూ జఠరాగ్ని వుంటుంది అంటే మన శరీర ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ వేడి మన పొట్ట లో ఉంటుంది. అలా ఉన్నప్పుడే మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణ ప్రక్రియ సజావుగా సాగాలంటే మన పొట్ట లో ఉండాల్సినంత ఉష్ణోగ్రత ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే.
కూల్ వాటర్ తాగితే జీర్ణ సమస్యలు
ఇక ఇదే సమయంలో మనం కూల్ వాటర్ తాగితే మన కడుపులో ఉండే జఠరాగ్ని చల్లారి పోతుంది. చల్లారిపోయిన పేగులు, నాడులు, కణాలు తిరిగి వేడెక్కడానికి మళ్లీ కొంత సమయాన్ని తీసుకుంటాయి అని, ఇక ఈ లోపు మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాదని చెబుతున్నారు.
ఆహారం పొట్టలో ఎక్కువసేపు జీర్ణం కాకుండా ఉంటే అది గ్యాస్ ను రిలీజ్ చేసి ఎసిడిటికి కారణం అవుతుందని చెబుతున్నారు. అందుకే పొరపాటున కూడా కూల్ వాటర్ తాగకూడదు అని సూచిస్తున్నారు.
కొవ్వు తగ్గాలంటే కూల్ వాటర్ మానెయ్యండి
ఇక అంతే కాదు చల్లటి నీళ్లు తాగడం వల్ల కొవ్వులు గడ్డకట్టి జీర్ణమయ్యేందుకు లేట్ అవుతుందని చెబుతున్నారు. కూల్ వాటర్ తాగటం వల్ల కొవ్వు తగ్గదని అంటున్నారు.
ఇక భోజనం చేసే సమయంలో, భోజనం చేసిన వెంటనే కూడా నీళ్లను తాగడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు.
భోజనం చేసిన రెండు గంటల తర్వాత నీటిని తాగితే మంచిదని సూచిస్తున్నారు. గోరువెచ్చని నీళ్లను తాగడం మంచిదే అయినప్పటికీ, విపరీతంగా వేడిగా ఉన్న నీళ్లు తాగడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు.
అతిగా వేడి నీటిని తాగితే ఈ అవయవాలకు నష్టం.. బీ కేర్ ఫుల్
అతిగా వేడి చేసిన నీటిని తాగిన లివర్ కు, పేగులకు నష్టం జరుగుతుందని, అందుకే ఎప్పుడైనా నీళ్లను తాగాలనుకుంటే గోరువెచ్చగా ఉన్న నీటిని మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.
గోరువెచ్చని నీటిని తాగడం వల్ల పొట్ట లో ఉన్న కొవ్వు త్వరగా కరుగుతుంది అని, కాస్త బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండడానికి ఇది వీలు కల్పిస్తుందని చెబుతున్నారు.
మొత్తంగా చూస్తే అతిగా చల్లగా ఉన్న నీళ్లు తాగినా, అతిగా వేడిగా ఉన్న నీళ్లు తాగినా ఆరోగ్యానికి హాని కలుగుతుందని, గోరువెచ్చని, లేదా నార్మల్ నీటిని తాగడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.
0 Comments:
Post a Comment