health tips: మీరు నీళ్ళు తక్కువ తాగుతున్నారని చెప్పే సంకేతాలివే.. ఒకసారి చెక్ చేసుకోండి!!
ప్రతి రోజు మనం మన శరీరానికి ఎంత నీరు అవసరమో అంత నీరు కచ్చితంగా తాగి తీరాలి. నీరు తక్కువగా తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉంచడంలో, మన ఆరోగ్యాన్ని కాపాడడంలో నీరు గణనీయమైన పాత్ర పోషిస్తుంది.
అందుకే ప్రతి రోజు మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని మరీ నీటిని తాగాలి. ఉదయం నిద్ర లేవడమే ప్రశాంతంగా కూర్చుని నీరు తాగడంతో ప్రారంభించాలి. రోజంతా మర్చిపోకుండా నీటిని తాగుతూ ఉండాలి.
నీళ్ళు తక్కువ తాగితే మొదట వచ్చే సమస్య ఇదే
ఒకవేళ మనం నీరు తక్కువగా తాగుతున్నాము అంటే శరీరం కొన్ని అనారోగ్య సంకేతాలను చూపిస్తుంది. ఆ సంకేతాలను బట్టి మనం నీటిని ఎక్కువగా తాగాలి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మన శరీరం చూపించే ఆ అనారోగ్య సంకేతాలు ఏంటి అంటే.. నీరు తక్కువగా తాగితే ముఖ్యంగా మన మూత్రం రంగులో మార్పు వస్తుంది. మూత్రం రంగు మార్పు వస్తే, మూత్రం కాస్త మంటగా అనిపిస్తే మనం శరీరానికి కావలసినంత నీటిని తీసుకోవడం లేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆ తర్వాత అయినా కనీసం నీళ్లు తాగడం పై మనం శ్రద్ధ పెట్టాలి.
నీరు తక్కువ తీసుకుంటే తలనొప్పితో పాటు ఈ సమస్యలు
నీరు తక్కువగా తీసుకుంటున్నట్లు అయితే మనం తరచుగా తలనొప్పికి గురవుతూ ఉంటాం. ఎటువంటి కారణాలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తలనొప్పి వస్తూ ఉంటే మనం నీళ్లు తాగడం లేదు అనే విషయాన్ని గుర్తించాలి. ఈ విధంగా వచ్చే తలనొప్పి మనం నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల తగ్గుతుంది. ఇక మనం నీళ్లు తక్కువగా తీసుకుంటే మన చర్మం సాగినట్లుగా, డ్రై గా కనిపిస్తుంది. కాబట్టి మనం పుష్కలంగా నీటిని తీసుకోవడం వల్ల శరీరం బిగుతుగా, మాయిశ్చర్ తో కనిపిస్తుంది. ఇక ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని చర్మం సాగినట్లుగా ఉన్నా నీటిని ఎక్కువగా తీసుకోండి.
నీళ్ళు తక్కువగా తాగితే తిమ్మిర్లు, మలబద్ధకం కూడా
ఇక నీటిని తక్కువగా తీసుకుంటున్నట్లు అయితే కాళ్లు, చేతులు తిమ్మిర్లు రావడం, లో బిపి తో బాధపడటం వంటి సమస్యలు వస్తాయి. నీళ్లు తక్కువగా తాగితే మన గుండె కొట్టుకునే విధానంలోనూ హెచ్చుతగ్గులు రావడం సంభవిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు నీళ్లు తక్కువగా తాగడం వల్ల మలబద్ధకంతో ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి శరీరంలో ఇన్ని సమస్యలకు మనం సరిగా నీళ్లు తాగకపోవడమే కారణం అన్న విషయాన్ని గుర్తుంచుకొని పుష్కలంగా నీటిని తాగితే అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యంగా జీవించవచ్చు.
0 Comments:
Post a Comment