లండన్: ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే? చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరి ముఖం, శరీరాకృతి ఒక్కో తీరులో ఉంటాయి. కానీ, శాస్త్రీయంగా కొన్ని పద్ధతుల్లో అందమైన వ్యక్తుల ముఖాలను గుర్తించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు (Scientists).
అంతేకాదు ఈ ఏడాది అందమైన వ్యక్తి ఎవరనేది కూడా తేల్చేశారు. బ్రిటీష్ నటుడు రెగె జీన్ పేజ్ (Rege-Jean Page)ను అందమైన వ్యక్తిగా శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఇందుకోసం సాంప్రదాయ ఫేస్ మ్యాపింగ్ పద్ధతి గ్రీక్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటి ఫై (Greek Golden Ratio of Beauty Phi) ని ఉపయోగించారు. దీంతో ఒక వ్యక్తి ముఖం ఎంత పరిపూర్ణంగా ఉందో లెక్కించవచ్చు.
బ్రిటన్‌కు చెందిన కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డి సిల్వా కంప్యూటరైజ్డ్ బ్యూటి ఫై మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా రెగె జీన్ పేజ్‌ను ప్రపంచంలోనే అందమైన వ్యక్తిగా గుర్తించారు.
ఈ మ్యాపింగ్ ప్రక్రియ ప్రకారం జీన్ పేజ్ కళ్లు, కనుబొమ్మలు, ముక్కు, పెదాలు, దవడ, ముఖం అమరికను అంచనా వేస్తారు. అలా ఇతడి ముఖం 93.65 శాతం కచ్చితత్వంతో ఉన్నట్లు గుర్తించారు.
తర్వాతి స్థానాల్లో థోర్ సినిమాలో నటించిన క్రిస్ హెమ్స్‌వర్త్ (93.53 శాతం), బ్లాక్ పాంథర్ నటుడు మిఖాయేల్ బి జోర్డాన్ (93.46 శాతం), సింగర్ హ్యారీ స్టైల్ (92 .30 శాతం)ల ముఖాలు ఉన్నట్లు వెల్లడించారు.
''బ్యూటి ఫై మ్యాపింగ్ టెక్నిక్‌లు ఒక వ్యక్తిని శారీరకంగా అందంగా ఉన్నాడనేందుకు అవరసరమైన అంశాలను విశ్లేషించి కచ్చితమైన ఫలితాలను వెల్లడిస్తాయి.
ఇవి మాకు శస్త్రచికిత్సలు చేసేప్పుడు ఉపయోగపడతాయి. ఇదే ప్రమాణాలను ఉపయోగించి రెగె జీన్ పేజ్‌ను అందమైన వ్యక్తిగా గుర్తించాం. శాస్త్రీయంగా అతనికి అందమైన ముఖం, గోధుమ రంగు కళ్లు ఉన్నాయి.
కళ్లు, పెదాలు కచ్చితమైన స్థానాల్లో ఉండటంతో అతని ముఖం అందమైనదిగా పరీక్షల్లో నిర్ధరణ అయింది '' అని డాక్టర్ జూలియన్ డి సిల్వా తెలిపారు.
0 Comments:
Post a Comment