Gold బంగారం ధరించడం ఈ రాశుల వారికి శుభం, ఈ రాశుల వారు ధరిస్తే కష్టాలు తప్పవు
బంగారం కేవలం విలువైనది మాత్రమే కాదు. చాలా మందికి ఎంతో ఇష్టమైనది కూడా. బంగారు ఆభరణాలు ధరించాలని మహిళలు, పురుషులు ఇద్దరూ కోరుకుంటారు. బంగారు నగలు వేసుకోవాలని స్త్రీలు ఎక్కువగా కోరుకుంటారు.
బంగారాన్ని కేవలం ఇష్టంగానే కాకుండా స్టేటస్ సింబల్‌గా కూడా ధరిస్తారు. బంగారం కలిగి ఉండటం అనేది సంపదకు చిహ్నంహా పరిగణించబడుతోంది. జ్యోతిష్యంలో కూడా బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. అవసరాలను, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బంగారాన్ని ధరించాలి.
బంగారం ధరించడం వల్ల ప్రయోజనం పొందితే అది మిమ్మల్ని ధనవంతులను, సంపన్నులను చేస్తుంది. కొన్నిసార్లు బంగారం ధరించడం హాని చేయవచ్చు. అందుకే బంగారు నగలు ధరించే ముందు పండితులను కలవడం ముఖ్యమని చెబుతారు.
ఈ రాశుల వారు బంగారం ధరిస్తే మంచిది:
మేషం
కర్కాటకం
సింహం
ధనుస్సు
తులారాశరి
మకర రాశి
వీరు బంగారం ధరిస్తే అశుభం:
వృశ్చిక రాశి
మీన రాశి
వృషభ రాశి
మిథున రాశి
కన్యా రాశి
కుంభ రాశి
నడుము వద్ద బంగారం ధరించడం:
నడుము భాగంలో బంగారాన్ని ధరించకూడదని శాస్త్రం చెబుతోంది.
నడుము భాగంలో బంగారం ధరించడం వల్ల మనిషి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.
కాబట్టి వడ్డానం లాంటివి బంగారు ఆభరణాలను ధరించవద్దని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఏ వేలికి బంగారం ధరించవచ్చు:
ఉంగరపు వేలుకు బంగారు ఉంగరాన్ని ధరించడం వల్ల మంచి జరుగుతుంది. ఖగోళ శక్తి సక్రియం చేయబడి అది బంగారం నుండి ప్రసరిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
పురుషులు కుడి చేతి ఉంగరపు వేలికి బంగారు ఉంగరం ధరించాలి.
మహిళలు ఎడమ చేతి ఉంగరపు వేలికి బంగారు ఉంగరం ధరించాలి.
ఏ వేలికి ఎప్పుడు ధరించాలి:
దగ్గు, సమస్య ఉన్న వారు చిటికెన వేలుకు బంగారం ఉంగరం ధరించవచ్చు.
కీర్తి, హోదాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మధ్య వేలికి బంగారాన్ని ధరించాలి.
ఏకాగ్రత సమస్యలు ఎదుర్కొంటుంటే చూపుడు వేలికి బంగారం ధరించాలి.
ఏ సమస్యకు ఎలాంటి బంగారం ధరించాలి:
గర్భం దాల్చడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఉంగరపు వేలికి బంగారాన్ని ధరించాలి.
కడుపు నొప్పి, ఊబకాయంతో బాధపడుతున్న వారు బంగారం ధరించకపోవడం మంచిది.
భావోద్వేగాలను నియంత్రించుకోలేని వారి కూడా బంగారం ధరించకపోవడం ఉత్తమం.
జాతకంలో బృహస్పతి ఉచ్ఛస్థితిలో ఉంటే బంగారం ధరించకపోవడం మంచిది.
దంపతుల మధ్య సాన్నిహిత్యంలో సమస్యలు ఉంటే బంగారు లాకెట్‌తో కూడిన గొలుపు ధరించాలి.
బంగారాన్ని ఎలా దాచిపెట్టాలి:
బంగారాన్ని ఎరుపు రంగు కాగితంలో చుట్టి దాని చుట్టూ గుడ్డ చుట్టి దాచాలి.
తూర్పు లేదా నైరుతి వైపు లాకర్లో దాచిపెట్టడం మంచిది.
ఇనుప వస్తువులను బంగారు వస్తువులను ఒకేచోట దాచకూడదు.
0 Comments:
Post a Comment