Gold Loan Benefits: గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల కలిగే 5 లాభాలు ఇవే!
Gold Price Today | దేశంలో దాదాపు ప్రతి ఒక్క కుటుంబంలోనూ బంగారం ఉంటుందని చెప్పుకోవచ్చు.
ఏమీ లేనోళ్ల దగ్గర కూడా కాస్తో కూస్తో బంగారం ఉండే ఛాన్స్ ఉంది. అంటే మన దేశంలో బంగారం డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
బంగారం కలిగి ఉండట వల్ల ఒక ముఖ్యమైన ప్రయోజనం పొందొచ్చు. విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు బంగారం తనఖా పెట్టి సులభంగా లోన్ పొందొచ్చు. దీని వల్ల చాలా బెనిఫిట్ లభిస్తుంది. కష్ట సమయాల్లో బంగారం వల్ల ఊరట పొందొచ్చు.
పర్సనల్ లోన్ కాకుండా గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల పలు రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే.. గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల లభిస్తున్న ప్రయోజనాలు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం. ఎమర్జెన్సీ సమయంలో గోల్డ్ లోన్ లాభాలు ఏంటివో చూద్దాం.
క్విక్ ప్రాసెసింగ్ అండ్ ఇన్స్టంట్ డిస్బర్సల్. ప్రస్తుతం టెక్నాలజీ సాయంతో గోల్డ్ లోన్స్‌ను గంట వ్యవధిలోనే అందిస్తున్నాయి. వేగంగా లోన్ తీసుకోవచ్చు. ఇతర రుణాలతో పోలిస్తే.. ఇది చాలా బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. డబ్బులతో అవసరం పడినప్పుడు వెంటనే గోల్డ్ లోన్స్‌తో గట్టెక్కవచ్కు.
ఇంకా గోల్డ్ లోన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకువెలితే చాలు. బ్యాంక్ అధికారులు సులభంగా లోన్ మంజూరు చేస్తారు. మీ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి డాక్యుమెంటలు ఇవ్వాల్సి ఉంటుంది.
అంతేకాకుండా అధిక లోన్ టు వాల్యూ రేషియో లభిస్తుంది. అంటే మీ బంగారానికి గరిష్ట విలువను లోన్ రూపంలో పొందొచ్చు. అందువల్ల ఎక్కువ బంగారం ఉంటే ఎక్కువ లోన్ వస్తుంది. అంటే చేతికి ఎక్కువ డబ్బులు వస్తాయి. అయితే వడ్డీ భారం కూడా పెరుగుతుంది.
అంతేకాకుండా మరో బెనిఫిట్ ఉంది. అదే తక్కువ వడ్డీ రేట్లు. గోల్డ్ లోన్‌పై ఇతర రుణాల కన్నా వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. పర్సనల్ లోన్‌తో పోలిస్తే.. సగం వడ్డీకే గోల్డ్ లోన్స్ పొందే అవకాశం ఉంటుంది. అందుకే ఇవి మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
ఇంకా తీసుకున్న రుణాన్ని సులభంగానే తిరిగి చెల్లించొచ్చు. మీరు పలు రకాల పేమెంట్ ఆప్షన్లు లభిస్తాయి. ప్రతి నెలా వడ్డీ చెల్లించొచ్చు. లేదంటు ఒకేసారి ఏడాది చివరిలో వడ్డీతోపాటుగా అసలు చెల్లించే వెసులుబాటు ఉంది. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. లేదంటే మీ వద్ద డబ్బులు ఉంటే అప్పుడప్పుడు అసులు కట్టేస్తూ రావొచ్చు.
ఇకపోతే హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధరలను గమనిస్తే.. పది గ్రాములకు రూ. 55,960 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. అదే 22 క్యారెట్ల బంగారం రేటు అయితే పది గ్రాములకు రూ. 51,300 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు ఈ ఏడాదిలో మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.
0 Comments:
Post a Comment