Gilgit Baltistan : మరో శ్రీలంక అవ్వడానికి పాకిస్తాన్ సిద్ధమైంది. ఆర్థిక సంక్షోభంతో ఇప్పుడు పాకిస్తాన్ అంతటా గోధుమపిండి కొరత ఏర్పడింది. ఆహార సంక్షోభంతో ప్రజలకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే), గిల్గిత్ బాల్టిస్తాన్ (జీ-బీ) లు పాక్ కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి.
నివాసితులు అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని దోపిడీ చేసిన పాకిస్తాన్ ప్రభుత్వం వివక్షాపూరిత విధానాలపై ఆగ్రహంతో ఉన్నారు. భారత్ లో పునఃకలయికను వారంతా కోరుతున్నారు
భారత సరిహద్దుల్లోని కార్గిల్ రోడ్ తెరవండి.. తాము భారత్ లో కలుస్తాం.. అంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ప్రజలు నిరసన బాటపట్టారు. పాక్ కు వ్యతిరేకంగా నిరసన మొదలుపెట్టారు.
ఇన్నాళ్లు పాక్ కబంధ హస్తాల్లో మగ్గిన ప్రజలు ఇప్పుడు తిరుగుబావుటా ఎగురవేశారు. నడిరోడ్డుపైకి భారీగా వచ్చి నిరసన తెలుపుతున్నారు. మైనస్ డిగ్రీ చలిలోనూ పోరాటాలతో పాక్ కు వ్యతిరేకంగా హోరెత్తిస్తున్నారు.
ఇంటర్నెట్లో అనేక వీడియోలు ఇప్పుడు పాక్ కు వ్యతిరేకంగా నివాసితులలో అసంతృప్తి పరిధిని చూపుతున్నాయి. ఒక వీడియో గిల్గిట్-బాల్టిస్తాన్‌లో భారీ ర్యాలీని చూపించింది.
దీనిలో కార్గిల్ రహదారిని తిరిగి తెరవండి. భారతదేశంలోని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో కలపండి అంటూ నినాదాలు చేశారు. కార్గిల్ జిల్లాలో తోటి బాల్టీలతో తిరిగి కలపడం కోసం డిమాండ్లు లేవనెత్తబడ్డాయి.
గిల్జిట్ -బాల్తిస్తాన్ నిజంగానే పాకిస్తాన్ నుండి విడిపోతుందా? అది సాధ్యమేనా? దీనిపై 'రామ్' గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
0 Comments:
Post a Comment