ఈ రోజుల్లో గీజర్ వాడకం విపరీతంగా పెరిగింది.
మారిన వాతావరణ పరిస్థితుల్లో తరుచుగా వర్షాలు పడుతూ ఉండడం.. చలి కూడా అధికంగా ఉంటుండడంతో ఎల్లప్పుడూ స్నానానికి వేడి నీరు అవసరం ఏర్పడడంతో గీజర్ ఉండాలని కోరుతున్నారు.
అయితే.. గీజర్ల కారణంగా ఇటీవల ప్రమాదాలు జరుగుతూ ఉండడం, కొన్ని చోట్ల ప్రాణాలు కూడా కోల్పోతుండడంతో వాడే వారు భయపడుతున్నారు.
అయితే.. గీజర్ వాడకంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ జాగ్రత్తలు ఏంటో చూద్దాం.
1. ఆఫ్ చేయడం మర్చిపోవద్దు.. చాలా సార్లు మనం గీజర్‌ని ఆన్ చేసి.. ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటాం. గీజర్ ఎక్కువసేపు ఆన్‌లో ఉంటే.. పేలడం జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గీజర్ ఆన్ చేసిన సమయంలోనే ఎప్పుడు ఆఫ్ చేయాలన్నది గుర్తుంచుకోవాల.
అవసరం అయితే.. అలారం పెట్టుకోవాలి. అయితే.. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఆఫ్ అయ్యే గీజర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే..వాటిని కూడా ఆఫ్ చేయకుండా అలా వదిలేయడం మంచిది కాదు. మీ గీజర్ పాత మోడల్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఆఫ్ చేస్తూ ఉండాలి. ఇంకా సర్వీసింగ్, రిపేర్ కూడా తరుచుగా చేయిస్తూ ఉండాలి.
2. ఫిట్టింగ్ మీరే చేయకండి.. ఈ యూట్యూబ్ వచ్చాక.. అందులో వీడియోల చూసి టీవీలు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు, గీజర్లను తామే అమర్చుకుంటున్నారు అనేక మంది. అయితే.. గీజర్ ను మాత్రం మీరు ఫిట్ చేయకండి.
టెక్నీషియన్ తోనే ఫిట్టింగ్ చేయించండి. ఏదైనా కనెక్షన్ ఇవ్వడంలో తప్పు చేస్తే.. షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. లేదా గీజర్ పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏమైనా చిన్న చిన్న రిపేర్ వచ్చినా సొంత నాలెడ్జ్ వాడకుండా టెక్నీషియన్ తోనే చేయించడం చాలా బెటర్.
3. బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్.. గీజర్ లో బ్యూటేన్ మరియు ప్రొపేన్ అనే వాయువులు ఉంటాయి. ఇవి కార్బన్ డయాక్సైడ్ను ఉత్పత్తి చేస్తాయి. అందుకే బాత్రూమ్లో గీజర్‌ను అమర్చేటప్పుడు, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను అమర్చండి.
తద్వారా దాని నుండి ఏ గ్యాస్ వచ్చినా బాత్రూంలో పేరుకుపోదు. ఈ వాయువులు మీ శరీరానికి మంచివి కావు మరియు మీకు హాని కలిగిస్తాయి.
4. గీజర్‌ను పిల్లలకు అందేలా ఉంచకండి
పిల్లలకు సాధారణంగా ఏ కొత్త వస్తువును చూసినా.. పట్టుకోవాలని అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లలకు అందని ఎత్తులో గీజర్ ను అమర్చండి. దీంతో పిల్లలు గీజర్‌ను తాకలేరు.
గీజర్ ను అందే ఎత్తులో ఉంచితే వాటిని ముట్టుకోవడం ద్వారా షాక్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
0 Comments:
Post a Comment