Fruits stickers - పండ్లపై కనిపించే స్టిక్కర్లపై ఉండే కోడ్ అర్థం ఇదే...
పండ్లకు స్టిక్కర్లు అంటించి ఉండటాన్ని మీరు చూసే ఉంటారు. వాస్తవానికి ఈ స్టిక్కర్లు ఒక నిర్దిష్ట కారణం కోసం అలా అతికిస్తారు. దానిపై కనిపించే కోడ్‌లోని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పండు మీద కనిపించే ఆ చిన్న కార్టూన్ స్టిక్కర్ ను తీసి పారేసేముందు పరిశీలించి చూస్తే దాని మీద నంబర్ మీకు కనిపిస్తుంది. ఆ నంబర్ ఎందుకు ఉంటుందో తెలుసా? దీనిని పీఎల్‌యూ కోడ్ లేదా ధర శోధన కోడ్ అని కూడా అంటారు. ఈ స్టిక్కర్లు డిజైన్ కోసం మాత్రమే ఉన్నాయని మీరు అనుకుంటే, అది తప్పు అని తెలుసుకోండి. నిజానికి ఈ స్టిక్కర్లు ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి.
4 అంకెల కోడ్
పండుపై కనిపించే స్టిక్కర్‌పై కోడ్ 3 లేదా 4తో ప్రారంభమైతే ఆ పండు పెరుగుదలకు ఎరువులు, పురుగుమందులు ఉపయోగించినట్లు అర్థం. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో ఈ పండు ఉత్పత్తి చేశారని దాని అర్థం. పురుగుమందులు శరీరానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే.
8తో మొదలయ్యే ఐదు అంకెల కోడ్
పండుపై 8తో మొదలయ్యే ఐదు అంకెల కోడ్ ఉంటే ఆ పండు సేంద్రియ పద్ధతిలో పండించారని అర్థం. అలాగే దానిలో జన్యుపరమైన మార్పులు చేశారని అర్థం. ఈ స్టిక్కర్ ఎక్కువగా అరటి, బొప్పాయి, పుచ్చకాయలపై కనిపిస్తుంది.
9తో ప్రారంభమయ్యే ఐదు అంకెల కోడ్
పండుపై 9తో మొదలయ్యే ఐదు అంకెల కోడ్ కనిపిస్తే ఆ పండును పురుగుమందులు లేకుండా పండించారని, దానిని పండించడానికి పాత వ్యవసాయ పద్ధతులను అనుసరించారని అర్థం. ఇది ఆరోగ్యానికి మంచిదని గ్రహంచవచ్చు.
0 Comments:
Post a Comment