eSIM: ఇండియాలో పెరుగుతున్న సిమ్ స్వాప్ మోసాలు..eSIM ద్వారా ఇలా రక్షణ పొందండి..
ESIM : ఇండియాలో కొన్ని సంవత్సరాలుగా ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల సిమ్ స్వాప్ ఫ్రాడ్స్(Sim swap frauds) గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి.
ఈ విధానంలో ఒక వ్యక్తి వాడే సిమ్‌తో డూప్లికేట్ సిమ్(Duplicate sim) తీసుకొని, వారి అకౌంట్ నుంచి డబ్బు మాయం చేస్తున్నారు. అయితే eSIMల వినియోగం ద్వారా ఈ తరహా మోసాలకు చెక్ పెట్టవచ్చు.
యూఎస్‌లో అందుబాటులో ఉన్న ఐఫోన్ 14 మోడల్స్‌కు సిమ్ స్లాట్‌లు ఉండవు. ఇవి eSIMకి మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఇండియాలో చాలా మంది ధర తక్కువని యూఎస్‌లోని బంధువుల నుంచి ఐఫోన్‌లు తెప్పించుకుంటారు. ఇప్పుడు వారికి రెండే దార్లు ఉన్నాయి.. ఒకటి eSIMకి మారడం లేదా ఇండియాలోనే ఐఫోన్‌ను కొనుగోలు చేయడం. ఫిజికల్ సిమ్‌తో పోలిస్తే eSIM మరింత సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.
SIM స్వాప్ ఫ్రాడ్ అంటే ఏంటి?
SIM స్వాప్ ప్రాసెస్‌లో నేరగాళ్లు మొదట వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీ వంటివి సేకరిస్తారు. ఫిషింగ్ ఈమెయిల్‌లు, మెసేజ్‌లు, కాల్స్ ద్వారా పర్సనల్ డీటైల్స్ సేకరిస్తారు. అవసరమైన అన్ని వివరాలను సేకరించిన తర్వాత, ఫోన్‌ను పోగొట్టుకోవడం లేదా పాత సిమ్ పాడైపోవడం వంటి కారణాలతో డూప్లికేట్ సిమ్‌ను జారీ చేయమని టెలికాం ఆపరేటర్‌ను సంప్రదిస్తారు. టెలికాం ఆపరేటర్ కంపెనీకి సమర్పించిన వివరాలు సరైనవే అయితే.. మోసగాడు సులువుగా బాధితుడి నంబర్‌తో కొత్త సిమ్ తీసుకుంటాడు. సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత పూర్తి కంట్రోల్ హ్యాకర్‌కు లభిస్తుంది.
మోసాలకు ఎలా చెక్ పెట్టాలి?
eSIMకి మారడం సురక్షితమైన మార్గాలలో ఒకటి. ఇది ఫిజికల్ SIM కార్డ్‌కి డిజిటల్ వెర్షన్. eSIMని యాక్టివేట్ చేయడానికి వివరాలు, పర్సనల్ ఐడెంటిఫియబుల్ ఇన్‌ఫర్మేషన్ (PII)తో రిజిస్టర్ చేసుకోవాలి. eSIM అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచడానికి ఫేస్ ID లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్ సెట్ చేయవచ్చు. eSIM ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు SIM కార్డ్ పోయిందని లేదా పాడైపోయిందని స్కామర్‌లు క్లెయిమ్ చేయలేరు.
eSIM ప్రయోజనాలు
ఇవి సులభంగా యాక్టివేట్ అవుతాయి. రిమోట్‌గా డీయాక్టివేట్ చేయవచ్చు. మల్టిపుల్‌ఫోన్ నంబర్‌లు, ప్లాన్‌లను ఒకే డివైజ్‌లో నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. eSIMతో పోగొట్టుకోవడం, పాడవడం లేదా దొంగిలించడం వంటి భయాలు ఉండవు. వివిధ క్యారియర్‌లు లేదా ప్లాన్‌ల మధ్య సులువుగా మారవచ్చు. స్టోర్‌ని సందర్శించాల్సిన అవసరం లేకుండా లేదా ఫిజికల్ సిమ్ కార్డ్ డెలివరీ అయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా eSIMలను రిమోట్‌గా యాక్టివేట్ చేయవచ్చు. ముందుగా స్మార్ట్‌ఫోన్ eSIMకి సపోర్ట్ చేస్తుందా? టెలికాం ఆపరేటర్ eSIM సదుపాయాన్ని అందజేస్తున్నారా? వంటి విషయాలు తెలుసుకోవాలి.
ఎయిర్‌టెల్ సిమ్‌ను ఇ-సిమ్‌గా మార్చే ప్రాసెస్
121కి 'e-SIM<>రిజిస్టెర్డ్ ఇమెయిల్ ఐడి' టైప్ చేసి మెసేజ్ పంపాలి. తర్వాత '1' అని రిప్లై ఇచ్చి ప్రాసెస్‌ని నిర్ధారించండి. ఎయిర్‌టెల్ మీకు కాల్ ద్వారా సమ్మతిని అందించమని కోరుతూ SMSను పంపుతుంది. కాల్ ద్వారా మీ IDని అథెంటికేట్ చేయండి. తర్వాత,రిజిస్టర్డ్ ఇమెయిల్ IDలో QR కోడ్‌ని అందుకుంటారు. ఇ-సిమ్ సేవలను ప్రారంభించడానికి ఆ QR కోడ్‌ను స్కాన్ చేయండి. eSIM దాదాపు 2 గంటల్లో యాక్టివేట్ అవుతుంది.
జియో ఇ-సిమ్ కన్వర్షన్
'GETE-SIM <32 అంకెల EID> 15 అంకెల IMEI>' అని టైప్ చేసి 199కి SMS పంపండి. *#06# డయల్ చేసి IMEI నంబర్ తెలుసుకోవచ్చు. అదే విధంగా సెట్టింగ్స్>అబౌట్ ఫోన్ ఆప్షన్‌లో EID నంబర్ లభిస్తుంది. మెసేజ్ పంపిన తర్వాత SMS, ఇమెయిల్ IDకి 19-అంకెల వర్చువల్ eSIM నంబర్ వస్తుంది.
eSIM నంబర్‌ని పొందిన తర్వాత.. 'SIMCHG <19 అంకెల e-SIM నంబర్>' అని టైప్ చేసి 199కి మరో SMS పంపండి. Jio 1-2 గంటల్లో eSIM ప్రాసెస్‌కు సంబంధించి అప్‌డేట్ పంపుతుంది. తర్వాత +91 2235072222 నుంచి ఆటోమేటెడ్ కాల్‌ని రిక్వెస్ట్ చేయడానికి '1' అని టైప్ చేసి 183కి SMS పంపండి. కాల్‌లో నిర్ధారించడానికి '1' డయల్ చేయండి.ప్రాసెస్ పూర్తయిన తర్వాత, eSIMని యాక్టివేట్ చేయడానికి స్మార్ట్‌ఫోన్‌లోని eSIM సెట్టింగ్‌కి వెళ్లి, ఇన్‌స్టాల్ 'డేటా ప్లాన్'పై క్లిక్ చేయండి. iPhoneలో సెట్టింగ్స్> మొబైల్ డేటా > యాడ్ డేటా ప్లాన్ > స్కాన్ QR కోడ్ > e-SIM ఆప్షన్ ఉంటుంది.
వోడాఫోన్-ఐడియా ఇ-సిమ్ కన్వర్షన్
e-SIMరిజిస్టెర్డ్ ఇమెయిల్ IDని 199కి SMS చేయండి. 'E-SIMY' అని రిప్లై ఇవ్వడం ద్వారా రిక్వెస్ట్‌ను నిర్ధారించండి. కాల్ ద్వారా సమ్మతిని తెలియజేయండి. తర్వాత రిజిస్టర్డ్ ఇమెయిల్ IDలో e-SIM యాక్టివేషన్ కోసం QR కోడ్ వస్తుంది.
0 Comments:
Post a Comment