Electric Cars: అతితక్కువ ధరకే మధ్య తరగతి వాళ్లకు అందుబాటులో ఉన్న కార్స్ ఇవే?
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో చాలామంది ఎలక్ట్రిక్ కారుల వైపు మొగ్గుచూపుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ ధరలు మండిపోవడంతో వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తిని చూపిస్తున్నారు.
అయితే కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నప్పటికీ వాటి ధరల కారణంగా వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు మధ్య తరగతి వారి బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని కార్లను రిలీజ్ చేశారు. అయితే సరైన అవగాహన లేకపోవడంతో కొందరికీ ఈ విషయం తెలియడం లేదు. మరి మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే కార్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పీఎం ఈజ్.. ఎలక్ట్రిక్ కారు. ఇందులో చిన్న 48 డబ్ల్యూ బ్యాటరీని ఉపయోగించారు.
ఇందులో ఉండే ఎలక్ట్రిక్ మోటార్ 13.6 పీఎస్ పవర్ మరియు 50 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 120 కిమీ, 160 కిమీ, 200 కిమీ వంటి మూడు రకాల రేంజ్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ కారు గరిష్ట వేగం గంటకు 70 కిలో మీటర్లు. ఈ ఈవీ బ్లూటూత్ సపోర్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ సీడీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డోర్ లాక్ అన్‌లాక్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లను పొందుతుంది. కాగా ఈ కారు ప్రారం ధర రూ.4.79 లక్షలుగా ఉంది. టాటా టియాగో ఈవీ ఎలక్ట్రిక్ కారు.. 19.2కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో 61 పీఎస్, 110 ఎన్ఎం అవుట్‌పుట్, 24 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో 75 పీఎస్, 114 ఎన్ఎం అవుట్‌పుట్‌లను పొందుతుంది. ఇవి వరుసగా 250 కిలో మీటర్లు నుంచి 315 కిమీ పరిధిని ఇస్తాయి.
ఈ ఎలక్ట్రిక్ కారులో 15ఏ సాకెట్ ఛార్జర్, 3.3కెడబ్ల్యూ ఏసీ ఛార్జర్, 7.2 కెడబ్ల్యూ ఏసీ ఛార్జర్, డీసీ ఫాస్ట్ ఛార్జర్ వంటి నాలుగు ఛార్జింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ కారు ధర రూ.8 లక్షలు గా ఉంది. టాటా టిగోర్ ఈవీ కారులో 26 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఎలక్ట్రిక్ మోటారుతో కలిసి 75 పీఎస్ శక్తిని మరియు 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 315 కిలో మీటర్ల పరిధిని అందుకుంటుంది. కారు స్టాండర్డ్ ఏసీ ఛార్జర్‌తో పాటు 25 కెడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌కు మద్దతు ఇస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.12.49 లక్షలు గా ఉంది.
నెక్సాన్ ఈవీ ప్రైమ్ కారు.. 30.2కెడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో జత చేసిన ఎలక్ట్రిక్ మోటారుతో 129 పీఎస్ శక్తిని, 245 ఎన్ ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు అరాయ్ సర్టిఫైడ్ పరిధి 312 కిలోమీటర్లు. ఈ కారుకు 3.3కెడబ్ల్యూ ఏసీ ఛార్జర్, 50కెడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్ మద్దతు ఉంది. ఈ కారు ధర రూ.14.99 లక్షలగా ఉంది. టాటా నెక్సాన్ ఈవీ మాక్స్.. కారు టాటా నెక్సాన్ ఈవీ మాక్స్‌లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 143 పీఎస్ పవర్, 250 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 40.5కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఏఆర్ఏఐ ధ్రువీకరించిన 437 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. ఇది 3.3 కెడబ్ల్యూ, 7.2 డబ్ల్యూ ఏసీ, 50 కెడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఎంపికను కలిగి ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ.18.34 లక్షలుగా ఉంది.
0 Comments:
Post a Comment