విద్యాశాఖ మంత్రి తో యూనియన్ నాయకులతో ఈరోజు జరిగిన చర్చల సారాంశం:
👉వీటిని ప్రమోషన్లు అనాలా? పని సర్దుబాటు అనాలా? సందేహాన్ని వ్యక్తం చేసిన సంఘాలు.
👉ప్రమోషన్లు అని మంత్రి గారు చెప్పగా, కమిషనర్ మాత్రం వీటిని పని సర్దుబాటు అని మాత్రమే ప్రస్తావన చేశారు.
ఈ సందిగ్గత పై యూనియన్స్ వివరణ అడుగగా, అధికారులకు కొన్ని పరిమితులు ఉంటాయి అని మంత్రి గారు సర్దారు.
👉శాశ్వత ప్రాతిపదికన ప్రమోషన్స్ ఇవ్వాలని గట్టిగా ప్రతిపాదించింది.
👉కోర్టు కేసు దృష్ట్యా ఈ సాంకేతిక పద్ధతులు అవలంబిస్తున్నాము. కోర్టు కేసు తేలిన వెంటనే వీటినే శాశ్వత పదోన్నతులుగా కన్ఫర్మ్ చేస్తాము అని చెప్పారు.
కేవలం హైయర్ క్లాసులు బోధిస్తున్నందుకు 2500 అలవెన్స్ గా ఇస్తాము అని చెప్పారు.
👉కొంతమంది వర్క్ అడ్జస్ట్మెంట్ అని భావించి అన్ విల్లింగ్ ఇచ్చారు. మరి వారి మాట ఏమిటి అని సంఘాలు ప్రశ్నించాయి.
👉వారికి రేపు మరొక్కసారి అవకాశం ఇస్తాము అని చెప్పారు.
👉DSC 30% సంగతి ఏమిటి అని అడగగా, 117 GO వల్ల ఉత్పన్నం అయ్యే వాటిని DSC కి కేటాయిస్తాం అని చెప్పారు.
స్టేట్ సభార్డినేట్ సర్వీస్ రూల్స్ కు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
0 Comments:
Post a Comment