ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతికి ఒక డీఏ
♦️రూ.10వేల కోట్ల బకాయిలు విడుదలచేయాలని సీఎంను కోరాం
♦️ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు
🌻ఈనాడు, అమరావతి: ఉద్యోగులకు సంక్రాంతికి ఒక డీఏ ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటు, గతేడాది రెండు డీఏలు ఇవ్వా లని కోరామని వెల్లడించారు. ఏప్రిల్ నుంచి బకాయిలు చెల్లిస్తారని పేర్కొ న్నారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగనన్ను ఏపీ ఐకాస నేతలు కలిశారు. పలు డిమాండ్లపై వినతిపత్రం సమర్పించారు. అనం తరం బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. 'గత రెండేళ్లుగా ఉద్యోగులకు బకాయిగా ఉన్న రూ.10వేల కోట్లను విడుదల చేయాలని కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. ఉపాధ్యాయులకు బదిలీల ప్రక్రియ చేపడతామన్నారు' అని తెలిపారు. ఐకాస ప్రధాన కార్యదర్శి హృదయరాజు మాట్లాడుతూ.. ఒకటో తేదీన జీతాలు ఇచ్చేలా చూడాలని కోరామన్నారు. ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ.. 'ముఖ గుర్తింపు ఆధారిత హాజరుపై క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్నాయి. క్షేత్ర స్థాయిలో పర్యటించేవారికి మినహాయింపు ఇవ్వాలి' అని కోరామ న్నారు. రాష్ట్రాపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి తిమ్మన్న మాట్లా డుతూ.. 'పురపాలక ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలు అమలు చేయాలి. గురుకుల ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలని కోరాం' అని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ ను ప్రభుత్వ ఉద్యో గుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు, ప్రతినిధులు రమేష్ తదితరులు కలిశారు.
0 Comments:
Post a Comment