✍️ CPS - సిపిఎస్ కోసం కేంద్రం ఒత్తిడి - రాష్ట్రానికి కేంద్రం లేఖ
🌻ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి
ఒకవైపు రాష్ట్రంలో సిపిఎస్ రద్దుకు ఉద్యమం జరుగుతుంటే... మరోవైపు దాని అమలుకోసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. దీనిలో భాగంగా ఈ పథకంలో ఉన్న ఉద్యోగుల వివరాలను సేకరిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి లేఖఅందింది. నిర్దిష్ట ప్రొఫార్మాను జత చేసి అందుకు అనుగుణంగా వివరాలు అందించాలని నిర్దేశించింది. ఈ పథకానికి సంబంధించి కేంద్రానికి రాష్ట్రం ఇచ్చిన వాటా నిధుల వివరాలు సమర్పించాలని కోరింది. అలాగే పథకం పరిధిలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు, వారి వివరాలు ఏమిటన్నది కూడా ఇవ్వాలని పేర్కొంది. అలాగే ఈ పథకంలో పరిధిలో కొనసాగుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగుల వివరాలు, వారిలో పింఛను పొందుతున్న వారి వివరాలు కూడా సమర్పించాలని కేంద్రం కోరింది. ఈ వివరాలను వీలయినంత త్వరగా అందించాలని లేఖలో పేర్కొంది.
0 Comments:
Post a Comment