CPS Amount : ఉద్యోగుల సీపీఎస్ సొమ్ము మాయం.
ఉద్యోగుల సీపీఎస్ సొమ్ము ఫ్రాన్ ఖాతా నిధులు గల్లంతు.
సీపీఎస్ ఉద్యోగులకు సర్కార్ మరో ఝలక్
సీపీఎస్ రద్దుపై మస్కా..
వారి సొమ్ములకూ టోకరా
10 నెలలుగా ఫ్రాన్‌లో పైసా జమచేయని సర్కారు
ఉద్యోగుల వాటానూ 'మాయం' చేసిన వైనం
మొత్తం 1500 కోట్లు గల్లంతైనట్టు అంచనా
తమ 'భవిష్యత్తు'పై ఉద్యోగుల్లో ఆందోళన
ప్రభుత్వ దగా తీరుపై ఆగ్రహావేశాలు
వడ్డీతో కలిపి జమ చేయాలని డిమాండ్
అమరావతి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): సీపీఎస్ ఉద్యోగులను అన్నిరకాలుగా జగన్ ప్రభుత్వం మోసగిస్తోంది. ఇప్పటికే సీపీఎస్ రద్దుపై మడం
తిప్పేసింది. తాజాగా సీపీఎస్ ఉద్యోగుల జీతంలో మినహాయించిన వాటాతోపాటు, తన వాటా కూడా వేయకుండా వారిని గందరగోళానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో 1.94 మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. వారికి చెందిన రూ. 1500కోట్ల రూపాయలు (ఇందులో సీపీఎస్ ఉద్యోగుల, ప్రభుత్వ వాటాలు చెరో రూ.750 కోట్లు) ఏమయ్యాయో తెలియని పరిస్థితి! సీపీఎస్ ఉద్యోగుల సొమ్మును జగన్ సర్కారు హాంఫట్ చేసిందని భావిస్తున్నారు. నెలనెలా వారి జీతాల నుంచి మినహాయించిన సొమ్మును, వారి ఫ్రాన్ (శాశ్వత పదవీవిరమణ ఖాతా నంబరు) ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయలేదు. అలాగే.. తాను చెల్లించాల్సిన వాటాను కూడా చెల్లించలేదు. గత పది నెలలుగా (డిసెంబరు 2022 వరకు) ఈ ఖాతాలో ఒక్క రూపాయీ జమ కాలేదు. దీంతో ఈ నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి సీపీఎ్‌సను అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లో రద్దు చేస్తామని ఎన్నికలముందు జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కాగానే సీపీఎస్ ఉద్యోగులకు ఆయన ఝలక్ ఇచ్చారు. వారి జీతాల నుంచి మినహాయించిన డబ్బు వారి ఖాతాల్లో జమ చేయకుండా ఇప్పుడు మరోసారి దొంగదెబ్బ తీశారు. ఏ నెలకు ఆనెల ఫ్రాన్ ఖాతాలు చూసుకుంటున్న ఉద్యోగులు... ప్రభుత్వం వంచనకు అవాక్కవుతున్నారు.
ఎందుకిలా చేస్తున్నారు?
సీపీఎస్ విధానంలో ప్రతి నెలా ఉద్యోగుల జీతం నుంచి ప్రభుత్వం పది శాతం కట్ చేస్తుంది. పదవీవిరమణ అనంతరం అందుకునే పెన్షన్ కోసం ఉద్యోగి జమ చేసే కంట్రిబ్యూషన్ ఇది. అదే సమయంలో ప్రభుత్వం కూడా అంతే వాటాను దానికి జమ చేయాలి. ఇలా మొత్తం 20 శాతం కంట్రీబ్యూషన్‌ను ప్రతి నెలా సీపీఎస్ ఉద్యోగి ఫ్రాన్ ఖాతాకు చేరాలి. గత ఏడాది మార్చి నుంచి డిసెంబరు వరకు గమనిస్తే.. పైసా కూడా జమ కాలేదు. ఒక 10 శాతం మంది ఉద్యోగులు మాత్రం తమకు చివరిసారిగా ఏప్రిల్, మేనెలలకు సంబంధించి తమ ఫ్రాన్ ఖాతాల్లో నగదు జమ అయిందని చెబుతున్నారు.
సచివాలయాల ఉద్యోగులపైనా దెబ్బ
సచివాలయాల ఉద్యోగులు 1.18లక్షలమంది ఉండగా, వారిలో 96 వేలమందిని ఇటీవల ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. అప్పటినుంచి వారిజీతాల నుంచి సీపీఎస్ కోసం కట్ చేస్తోంది. ఇలా ఒక్కో సచివాలయ ఉద్యోగికి రూ. 2700 చొప్పున కట్ అవుతోంది. అయితే, తమ ఫ్రాన్ ఖాతాలను పరిశీలించి చూసుకోగా..నగదు జీరోగా చూపిస్తోంది. అది చూసి వారంతా లబోదిబోమంటున్నారు.
అడిగే బాధ్యత కేంద్రానికి లేదా?
కేంద్రం నిర్దేశించినట్టే సీపీఎస్ విధానం అమలు చేస్తున్నామని రాష్ట్రాలు చెబుతున్నాయి. మరి ఈ పెన్షన్ విధానం సక్రమంగా అమలు చేయని రాష్ట్రాలను ప్రశ్నించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ఉద్యోగులు నిలదీస్తున్నారు. సీపీఎస్ విధానం ప్రకారం... తన వాటాను ప్రభుత్వం సకాలంలో జమ చేయకపోతే.. ఆ కాలానికి వడ్డీ కలిపి జమ చేయాలి. దీంతో వడ్డీతో సహా జమ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేంద్రం తన వాటాను ఇప్పుడు 14 శాతానికి పెంచింది. పలు రాష్ర్టాలు కూడా ఇదే బాటలో తమ వాటాను పెంచాయి. కానీ, జగన్ సర్కారు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదని ఉద్యోగులు మండి పడుతున్నారు.
ఉద్యోగులతో జగన్ ప్రభుత్వం చెడుగుడు ఆడుతోంది. ఉద్యోగాలు తన వద్ద దాచుకున్న నిధులను ఇప్పటికే లాగేసుకుంది. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తానని చెప్పి, ముఖ్యమంత్రి కాగానే జగన్ మడెం తిప్పేశారు. దీంతో తమ 'భవిష్యత్తు'పై ఉద్యోగులు అసలే బెంగ పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా, వారు తమ పదవీవిరమణ అనంతర పెన్షన్ ప్రయోజనాల కోసం జమ చేసి సొమ్మునూ 'మాయం' చేసేశారు. సీపీఎస్ ఫ్రాన్ ఖాతాలో ప్రభుత్వం తన వాటానుగానీ, ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా కట్ చేస్తున్న సొమ్ములనుగానీ గత పది నెలలుగా జమ చేయడం లేదు!
వడ్డీతో కలిపి చెల్లించాలి..
10 నెలలుగా మా ఫ్రాన్ ఖాతాల్లో ప్రభుత్వం తన వాటా నిధులు జమ చేయడం లేదు. ఈ కాలాన్ని లెక్కించి వడ్డీసహ జమ చేయాలి.
- ఏపీసీపీఎ్‌సయూఎస్ అధ్యక్షుడు దాస్
కంట్రిబ్యూషన్‌నూ జమ చేయరా?
హామీ ఇచ్చిన ప్రకారం సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయడంలేదు. సీపీఎస్ వాటాను సక్రమంగా జమ చేయకపోవడం అన్యాయం.
- అప్సా మాజీ కార్యదర్శి నాపా ప్రసాద్
0 Comments:
Post a Comment