హిందూ సంప్రదాయంలో ఎన్నో రకాల ఆచారాలు, నియమాలు ఉన్నాయి. హిందువులు ఆవును గోమాతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు.
ఆవును పూజిస్తే పుణ్యం వస్తుందని చాలామంది ప్రజలు భావిస్తారు.అవును పూజించే సమయంలో వేటిని ఆహారంగా పెడితే పుణ్యం వస్తుందో తెలుసా.
ఇప్పుడు ఆ విషయాల గురించి తెలుసుకుందాం. ఈ ఆహారాలను ఆవుకి పెడితే పుణ్యంతో పాటు ఎన్నో జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. నీటిలో నానబెట్టిన ఉలువలను గోమాతకు తినిపిస్తే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది.
నీటిలో నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు తినిపిస్తే ధన లాభం ఉంటుంది. నానబెట్టిన గోధుమలను గోమాతకు తినిపిస్తే కీర్తి, ప్రతిష్టలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇంకా చెప్పాలంటే తోటకూర, బెల్లం కలిపి గోమాతకు తినిపిస్తే మానసికంగా ప్రశాంతత కలిగే అవకాశం ఉంది. నానబెట్టిన కందులను గోమాతకు తినిపిస్తే కోపం, అప్పుల బాధలు తొలగిపోతాయి. నానబెట్టిన మినుములను గోమాతకు తినిపిస్తే ఆత్మవిశ్వాసం పెరిగే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు.
బీట్రూట్, పాలకూర గోమాతకు తినిపిస్తే ధన వృద్ధి కలిగి ఐశ్వర్యవంతులవుతారు. టమేటాలను గోమాతకు తినిపిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది.
బంగాళాదుంపలను గోమాతకు తినిపిస్తే ఏమైనా నరగోష ఉంటే దూరమైపోతుంది.ఇంకా చెప్పాలంటే క్యారెట్ ను గోమాతకు తినిపియడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది.
వంకాయను గోమాతకు తినిపిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది.అరటిపండును గోమాతకు తినిపిస్తే ఉద్యోగంలో ఉన్నత పదవి దక్కుతుంది.
దొండకాయను గోమాతకు తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. పెసరపప్పు, గోమాతకు తినిపిస్తే ఇంద్రియ నిగ్రహం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది నానబెట్టిన పొట్టు పెసరపప్పు గోధుమ గోమాతకు తినిపియడం వల్ల పిల్లలు చదువులో బాగా రాణిస్తారు .
నానా పెట్టిన శనగలు గోమాతకు తినిపియడం వల్ల ఇంటిలో ఉన్న కలతలు అన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయి.
0 Comments:
Post a Comment