Corn - బొగ్గులపై కాల్చిన మొక్క జొన్న కంకులతో క్యాన్సర్ ఛాన్స్..!
రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా మొక్క జొన్న కంకులను కాల్చుతూ లేదా ఉడక బెడుతూ అమ్ముతూ కనిపిస్తున్నారు. కొందరు మొక్క జొన్న కంకుల్లో ఉండే పిండి పదార్థాలు పీచు పదార్థాలు ఆరోగ్యానికి మంచిది అని, పిల్లలకు ఇమ్యూనిటీ పెంచడం మొదలు వారిలో పోషక లోపాలను తగ్గిస్తాయంటూ చెబుతున్నారు. కాని వీటివల్ల సమస్యలు ఉంటాయి అనే అనుమానంను కలిగి ఉన్నారు. ముఖ్యంగా బొగ్గుల కుంపటి పై కాల్చిన మొక్క జొన్న పొత్తులు తింటున్న సమయంలో ఆరోగ్యం విషయంలో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు.
మొక్క జొన్న పొత్తుల విషయంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి వైద్యులు కీలక విషయాలను వెళ్లడించారు. బొగ్గులపై కాల్చే మొక్క జొన్న పొత్తులు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 25 శాతం ఉన్నట్లుగా నిపుణులు పేర్కొన్నారు.
ముఖ్యంగా బొగ్గులపై కాల్చగా ఎక్కువ మాడిన వాటి విషయంలో డేంజర్ ఎక్కువగా ఉందట. బాగా మాడిన మొక్క జొన్న పొత్తులను తినడకుండా ఉండటం ఉత్తమం అనే అభిప్రాయంను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. బొగ్గులపై కాల్చిన సమయంలో నేరుగా వాటి నుండి వచ్చే పొగ అనేది మొక్క జొన్నలకు పడుతుంది కనుక తినకుండా ఉండటం బెటర్ అనే అభిప్రాయంను వైద్యులు వ్యక్తం చేశారు. మొక్క జొన్న పొత్తులు బొగ్గుల కుంపటిలో కాల్చినప్పుడు కొంత మేరకు అవి విషతుల్యం అవుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఉడక బెట్టిన సమయంలో ఎలాంటి ఇబ్బంది లేదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ నీటిలో మొక్క జొన్న కంకులను ఉడక పెట్టడం వల్ల పోషకాలు ఎక్కువ నష్ట పోక పోవడంతో పాటు ఆరోగ్యవంతంగానే ఉంటాయట. అందుకే మొక్క జొన్న కంకులను బొగ్గుల పై కాల్చినవి తినడం కంటే ఉడకబెట్టినవి తినడంకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఒక వేళ బొగ్గులపై కాల్చిన మొక్క జొన్న కంకులు తినాల్సి వస్తే ఎక్కువ కాల్చకుండా సాధారణంగా కాల్చినవి తినడం బెటర్. మరీ ఎక్కువ మాడిన కంకులను తినడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయని ప్రయోగాత్మకంగా నిరూపితం అయ్యింది.
0 Comments:
Post a Comment