Cholesterol Reduce Tips: చలికాలంలో ఈ ఫ్రూట్స్ తీసుకుంటే..కొలెస్ట్రాల్ వేగంగా తగ్గడం ఖాయం
చలికాలంలో వాతావరణం, జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంటుంది. ఫ్రైడ్ పదార్దాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమౌతుంది.
కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కొలెస్ట్రాల్ ఎందుకు ప్రమాదకరం, ఎలా కరిగించాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు రక్తనాళికల్లో పేరుకుపోతుంటుంది. ఫలితంగా రక్త సరఫరాలో ఇబ్బంది ఏర్పడి..రక్తపోటు పెరగడం, గుండెపోటుకు కారణం కావడం జరుగుతుంది. అయితే డైట్‌లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు. కొన్ని రకాల పండ్లను డైట్‌లో భాగంగా చేసుకుంటే..కొలెస్ట్రాల్ సులభంగా తగ్గించవచ్చు.
యాపిల్
యాపిల్‌లో పోలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. యాపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శరీరంలో మెటబోలిజం పెరిగి కొలెస్ట్రాల్ తగ్గడంలో దోహదమౌతుంది. యాపిల్ అనేది కొవ్వును చాలా వరకూ తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు దూరం చేసేందుకు ఉపయోగపడుతుంది.
బొప్పాయి
బొప్పాయి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. యాపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ చాలా వేగంగా కరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ కూడా నియంత్రణలో ఉంటుంది.
ఆరెంజ్, లెమన్
ఆరెంజ్, లెమన్‌లతో కొలెస్ట్రాల్ వేగంగా కరుగుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఫలితంగా కొలెస్ట్రాల్ వేగంగా కరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది.
పియర్
పియర్‌లో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు ఎక్కువ. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఫుష్కలంగా ఉంటాయి. ఫలితంగా రోజూ ఇవి తీసుకుంటే కొలెస్ట్రాల్ అద్భుతంగా నియంత్రితమౌతుంది. ఇందులో పేక్టిన్ అనే ఫైబర్ ఇందుకు దోహదపడుతుంది.
ద్రాక్ష
ద్రాక్షలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ద్రాక్షను డైట్‌లో భాగంగా చేసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణ సులభతరమౌతుంది. ద్రాక్షలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో దోహదపడతాయి.
0 Comments:
Post a Comment