China's two-child rule : ప్రంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా.. త్వరలో ముసలి దేశంగా మారబోతోందా అంటే అవుననే అంటున్నాయి ప్రపంచ దేశారు.
రోజురోజుకీ పెరిగిపోతున్న జనాభాను అదుపులో పెట్టేందుకు ఒకప్పుడు ఒక బిడ్డ ముద్దు రెండో బిడ్డ వద్దు అని చెప్పింది.
1970లో వన్ చైల్డ్ పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రభావంతో ఇప్పుడు ఆ ఆదేశంలో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. ఫలితంగా రానున్న కాలంలో యువకుల సంఖ్య మరీ తగ్గి.. వృద్ధుల సంఖ్య భారీగా పెరిగి వృద్ధ చైనా మారనున్నదనే లెక్కలు వినిపిస్తున్నాయి.
అప్రమత్తమైన డ్రాగన్ కంట్రీ..
జననాలు తగ్గడం.. మరణాలు లేకపోవడంతో చైనాలో యువకుల సంఖ్య తగ్గుతోంది. దీంతో డ్రాగన్ కంట్రీ అప్రమత్తమైంది. జననం సంఖ్య పెంచేందుకు 2016 లో నిబంధనలను సడలిస్తూ ఇద్దరు పిల్లలను కనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కానీ చైనా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో చైనాలో 16 నుంచి 59 ఏళ్ల మధ్య వయసువారి సంఖ్య ç7.5 కోట్లు తగ్గింది. ఇదే సమయంలో 60 ఏళ్లు దాటినవారి జనాభా 3 కోట్లు పెరిగింది.
దీంతో జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. పనిచేసేవారి సంఖ్య తగ్గుతుంది. సంపాదించే శక్తి ఉన్నవారు తగ్గిపోతారు. దీంతో మళ్లీ ఇద్దరు పిల్లలను కనాలని ప్రభుత్వం మొత్తుకుంటోంది.
తగ్గిన చైనా జనాభా..
2020లో చైనాలో 10.04 మిలియన్ల జననాలు మాత్రమే నమోదుకాగా 2019 సంవత్సరంతో పోలిస్తే 30 శాతానికి తగ్గిపోయింది. జపాన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రేడ్, ఎకానమీ ఇండస్ట్రీవారి అంచనా ప్రకారం.. 2050 నాటికి చైనాలో వృద్ధుల జనాభా 35 శాతం పెరుగుతుందని అంచనా వేసింది.
ప్రతీ ముగ్గురిలో ఒకరు వృద్ధుడు ఉంటాడని పేర్కొంది. ముఖ్యంగా డ్రాగన్ కంట్రీలో చోటు చేసుకున్న పరిణామాలతో అక్కడ జీవన వ్యయం భారీగా పెరిగింది. దీంతో యువత పెళ్లిళ్లను, దంపతులు పిల్లల్ని కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు.
దీంతో అక్కడ పునరుత్పత్తి రేటు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పిల్లలను కనాలని ప్రభుత్వం కోరుకుంటుంది.
ఇన్‌సెంటివ్ ప్రకటించిన ప్రభుత్వం..
జనాభా పెరుగుదలకు చైనా ప్రభుత్వం దంపతులకు ఇన్‌సెంటివ్ కూడా ఇస్తామని ప్రకటించింది. అయినా ఈ ఏడాది జనాభా గణనీయంగా తగ్గింది.
దీని ప్రభావం చైనాతోపాటు దక్షిణ కొరియా, జపాన్‌పైనా పడుతుంది. చైనా కంటే ముందే జపాన్ ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది.
జపాన్ జనాభా పెరుగుదలకు చర్యలు చేపట్టినా పెద్దగా ఫలితాలు ఉండడం లేదు. జపాన్, చైనాలు అభివృద్ధి చెందిన దేశాలు కావడంతో వృద్ధాప్యాన్ని ఎదుర్కొనే అవకాశం ప్రస్తుతానికి ఉంది. కానీ భవిష్యత్‌లో ఇది ఆయా దేశాలకు అత్యంత ప్రమాదకరమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
0 Comments:
Post a Comment